రిలయన్స్ చేతికి రూ.33వేల కోట్లు

Update: 2020-11-25 03:43 GMT

ముఖేష్ అంబానీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ జియోలోకి రూ.33,737 కోట్ల నగదు వచ్చింది. గూగుల్ సంస్థతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా యూస్ టెక్ దిగ్గజం గూగుల్ నుంచి డబ్బు అందినట్టు రిలయన్స్ సెబీకి సమాచారం అందించింది. దేశంలోనే టెక్నాలజీ రంగంలో అతిపెద్ద ఇన్వెస్ట్ మెంట్ ఇది. జియో ఫ్లాట్ ఫాంలో గూగుల్ కంపెనీ 7.73శాతం స్టేక్ తీసెుకుంది. ఇందుకోసం డబ్బును చెల్లించింది. అఫర్డబుల్ యాండ్రాయిడ్ బేస్ట్ 4జీ, 5జీ సేవలు అందించడంలో ఇరు కంపెనీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.

జియో ఫ్లాట్ ఫాంలో కేవలం గూగుల్ మాత్రమే కాదు.. మొత్తం 13 కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. 32.96శాతం వాటాలు విక్రయించింది. ఇందులో భాగంగా కంపెనీకి రూ.1,52,056 కోట్ల నగదు సమకూరుతోంది. ఫేస్ బుక్ అత్యధికంగా ఇన్వెస్ట్ చేసింది. 9.9శాతం స్టేక్ తీసుకుంది. ఇందుకోసం 43,574 కోట్లు చెల్లిస్తుంది. సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ADIA, TPG, ఇంటెల్, క్వాల్ కామ్ వంటి సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి.

Also Read:profit your trade


Tags:    

Similar News