Renault Duster 2026 : పాత డస్టర్‎కి కొత్త మేకప్.. జనవరి 26న రోడ్లపై రచ్చ లేపడానికి సిద్ధమైపోయిన రెనో బాస్.

Update: 2025-12-29 08:00 GMT

Renault Duster 2026 : భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ ట్రెండ్‌ను మొదలుపెట్టిన అసలైన బాస్ మళ్ళీ వస్తోంది. ఒకప్పుడు మధ్యతరగతి ప్రజల డ్రీమ్ కార్‌గా వెలుగొందిన రెనో డస్టర్ ఇప్పుడు సరికొత్త హంగులతో, ఆధునిక టెక్నాలజీతో రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. టాటా మోటార్స్ తన పాత సియెర్రాను తిరిగి తెచ్చి ఎలాగైతే సంచలనం సృష్టించిందో, ఇప్పుడు రెనాల్ట్ ఇండియా కూడా అదే బాటలో పయనిస్తోంది. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26, 2026న ఈ ఐకానిక్ కారును లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ టీజర్ విడుదల చేసింది.

రెనాల్ట్ విడుదల చేసిన టీజర్ చూస్తుంటే.. పాత డస్టర్ రఫ్ అండ్ టఫ్ లుక్‌ను అలాగే ఉంచుతూనే, ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కారు వెనుక భాగంలో వస్తున్న కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, ముందు వైపు ఉన్న ఎల్‌ఈడీ డీఆర్ఎల్ కారుకు ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. రూఫ్ మీద ఉన్న ఎత్తైన రూఫ్ రైల్స్ ఈ కారును మరింత స్టైలిష్‌గా, శక్తివంతంగా చూపిస్తున్నాయి. ఇది కేవలం పాత డస్టర్ లాంటిదే కాదు, అంతకంటే చాలా అడ్వాన్స్‌డ్ అని రెనాల్ట్ చెబుతోంది.

కారు లోపలి భాగం కూడా పూర్తిగా మారిపోయింది. డ్రైవర్ కోసం 7 ఇంచుల డిజిటల్ డిస్‌ప్లే, సెంటర్ లో 10.1 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండబోతున్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో పాటు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక కారు లవర్స్ ఎంతో ఇష్టపడే పనోరమిక్ సన్‌రూఫ్, ఎండ కాలంలో ఉపశమనం ఇచ్చే వెంటైలేటెడ్ సీట్లు ఈ కారులో హైలైట్‌గా నిలవనున్నాయి. 6 స్పీకర్ల అర్కామిస్ సౌండ్ సిస్టమ్ ప్రయాణంలో సంగీత ప్రియులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. కొత్త డస్టర్‌లోని అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ గా రాబోతున్నాయి. వీటితో పాటు 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ , ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా, ప్రమాదాలను ముందే పసిగట్టే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ కూడా ఈ కొత్త మోడల్‌లో ఉండబోతోంది. అంటే కారు అందమే కాదు, సేఫ్టీ విషయంలో కూడా రెనాల్ట్ ఒక అడుగు ముందే ఉంది.

కొత్త రెనాల్ట్ డస్టర్ ధర సుమారు రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది మార్కెట్ లీడర్లుగా ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మళ్ళీ తన పాత వైభవాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్న రెనాల్ట్ డస్టర్, జనవరి 26న ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

Tags:    

Similar News