Renault Filante : ఇది కారు కాదు, రోడ్ల మీద నడిచే విమానం..సెల్ఫ్ ఛార్జింగ్ టెక్నాలజీతో అరాచకం.

Update: 2026-01-16 08:15 GMT

Renault Filante : రెనాల్ట్ తన 2027 ఇంటర్నేషనల్ ప్లాన్‌లో భాగంగా ఈ ప్రీమియం క్రాస్ ఓవర్ ఎస్‍యూవీని రూపొందించింది. ఇది కేవలం ఒక కారు మాత్రమే కాదు, లగ్జరీకి కేరాఫ్ అడ్రస్. వోల్వో XC90, ఆడి Q7, లెక్సస్ RX వంటి దిగ్గజ కార్లతో తలపడేందుకు ఫిల్లాంతే సిద్ధమైంది. దీని డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంది. ముందు భాగంలో ట్విన్-బారెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, బంపర్ దగ్గర షార్ప్ డీఆర్ఎల్స్‌తో ఇది చూడగానే ఆకట్టుకునేలా ఉంది. గ్రిల్ లోపల చిన్న చిన్న ఎల్ఈడీ ఎలిమెంట్స్ దీనికి మరింత అందాన్ని ఇచ్చాయి.

ఫిల్లాంతే పొడవు ఏకంగా 4,915 మిమీ ఉంటుంది, అంటే ఇది రెనాల్ట్ నుంచి వస్తున్న అత్యంత పొడవైన కారు. దీనివల్ల కారు లోపల స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. వెనుక సీట్లలో కూర్చునే వారికి 320 మిమీ లెగ్‌రూమ్ లభిస్తుంది, అంటే మీరు కాళ్ళు చాపుకుని హాయిగా ప్రయాణించవచ్చు. ఇక 654 లీటర్ల భారీ బూట్ స్పేస్ మీ ప్రయాణ సామాన్లన్నింటికీ సరిపోతుంది. లోపల పెద్ద గ్లాస్ రూఫ్ ఉండటం వల్ల ఆకాశం కనిపిస్తూ ఒక విభిన్నమైన ఫీలింగ్‌ను ఇస్తుంది.

కారు లోపల అడుగుపెట్టగానే మూడు పెద్ద 12.3 అంగుళాల డిజిటల్ స్క్రీన్స్ దర్శనమిస్తాయి. ఇవి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్‌ఫోటైన్‌మెంట్, ప్యాసింజర్ డిస్‌ప్లేగా పనిచేస్తాయి. డ్రైవర్ కోసం అదనంగా 25.6 అంగుళాల భారీ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సమాచారాన్ని గాజు మీద ప్రదర్శిస్తుంది.

ఈ కారులో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని E-Tech 250 హైబ్రిడ్ సిస్టమ్. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇది 247 hp పవర్, 565 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సెల్ఫ్ ఛార్జింగ్ కారు కాబట్టి, ప్రత్యేకంగా ప్లగ్ పెట్టి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. వోల్వో XC40 లో వాడే అదే CMA ప్లాట్‌ఫారమ్‌పై దీనిని తయారు చేశారు.

దక్షిణ కొరియాలోని బుసాన్ ప్లాంట్‌లో తయారవుతున్న ఈ కారు, మార్చి 2026లో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఇది దక్షిణ అమెరికా మరియు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే, భారతీయ కస్టమర్లకు ఒక చిన్న నిరాశ కలిగించే విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఈ కారును ఇండియాలో లాంచ్ చేసే ప్లాన్ ఏదీ రెనాల్ట్ వద్ద లేదు. కానీ భవిష్యత్తులో పరిస్థితులు మారవచ్చు.

Tags:    

Similar News