Royal Enfield Classic 350 : రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ దెబ్బ.. మిగిలిన బైక్‌లన్నీ అబ్బ.

Update: 2025-12-27 12:10 GMT

Royal Enfield Classic 350 : భారతీయ రోడ్లపై గంభీరమైన శబ్దంతో దూసుకెళ్లే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా నవంబర్ 2025 సేల్స్ గణాంకాలను గమనిస్తే.. ఈ కంపెనీకి ఒక బైక్ మాత్రం అక్షరాలా లైఫ్ లైన్‎గా మారిందని అర్థమవుతోంది. అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350. మార్కెట్లోకి ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా, కుర్రాళ్ల నుంచి ముసలివాళ్ల వరకు అందరి ఫేవరెట్ ఎప్పుడూ క్లాసిక్ 350 అని మరోసారి నిరూపితమైంది.

క్లాసిక్ 350 - సేల్స్ రారాజు

నవంబర్ 2025 నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏకంగా 34,793 క్లాసిక్ 350 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 26.46 శాతం భారీ వృద్ధి. అంటే రోడ్డు మీద వెళ్లే ప్రతి మూడు ఎన్‌ఫీల్డ్ బైక్‌లలో ఒకటి ఖచ్చితంగా క్లాసిక్ 350 అన్నమాట. ఇక కంపెనీ నుంచి వచ్చిన లేటెస్ట్ మోడల్ హంటర్ 350 కూడా 20,793 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచి తన జోరును ప్రదర్శించింది. ఐకానిక్ బుల్లెట్ 350 కూడా 20,547 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

కొన్ని బైక్‌లకు తప్పని ఎదురుదెబ్బ

ఒకవైపు 350 సీసీ బైక్‌లు దూసుకుపోతుంటే, మరోవైపు ఖరీదైన మోడల్స్‌కు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. 650 ట్విన్స్ అమ్మకాలు దాదాపు 40 శాతం పడిపోయాయి. అలాగే అడ్వెంచర్ బైక్ హిమాలయన్ సేల్స్ కూడా 20 శాతం మేర తగ్గాయి. షాకింగ్ విషయమేమిటంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన స్టైలిష్ బైక్ షాట్‌గన్ కేవలం 93 యూనిట్లు మాత్రమే అమ్ముడై అత్యంత తక్కువ సేల్స్ నమోదైన బైక్‌గా నిలిచింది. గెరిల్లా, సూపర్ మీటియార్ మోడల్స్ కూడా ఈ నెలలో కాస్త వెనుకబడ్డాయి.

మొత్తంగా అదిరిపోయే వృద్ధి

మొత్తం మీద చూస్తే నవంబర్ 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ సుమారు 90,405 బైక్‌లను విక్రయించి, వార్షిక ప్రాతిపదికన 25.15 శాతం వృద్ధిని సాధించింది. అంటే భారతీయులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ పై ఉన్న నమ్మకం ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా క్లాసిక్ లుక్ మరియు మోడ్రన్ ఫీచర్లు కలిసిన 350 సీసీ సెగ్మెంట్ కంపెనీని లాభాల బాటలో నడిపిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త అప్‌డేట్స్ వస్తే ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News