ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్ల రీకాల్ చేపట్టింది. భారత్ సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో విక్రయించిన వాహనాలను వెనక్కి రప్పిస్తోంది. 2022 నవంబర్ నుంచి 2023 మార్చి మధ్య తయారైన వాహనాలను రీకాల్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. మోటార్ సైకిల్ వెనక భాగంలో ఉండే రిఫ్లెక్టర్‌లో లోపమే ఈ రీకాల్ చేపడుతున్నామని, ఆయా రిఫ్లెక్టర్లు కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే కారణమని కంపెనీ తెలిపింది.రీకాల్ ప్రక్రియను కంపెనీ దశలవారీగా చేపట్టనున్నట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది. తొలుత దక్షిణ కొరియా, అమెరికా, కెనడాలో ఈ రీకాల్‌ను చేపట్టనున్నారు. తర్వాత భారత్, బ్రెజిల్, లాటిన్ అమెరికా, యూరప్, యూకేలో ఈ ప్రక్రియ జరగనుంది. కంపెనీ ప్రతినిధులే వినియోగదారులకు రీకాల్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తారని, కేవలం 15 నిమిషాల్లోనే రిఫ్లెక్టర్ల మార్పిడి చేసి ఇస్తామని, ఈ ప్రక్రియ పూర్తి ఉచితంగానే చేపట్టనున్నట్లు తెలిపింది.