SEBI Chief Madhabi Puri : సెబీ చీఫ్‌ మాదభికి కేంద్రం క్లీన్‌ చిట్!

Update: 2024-10-23 07:30 GMT

వరుస వివాదాల్లో చిక్కుకున్న సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బుచ్‌కు ఉపశమనం లభించింది. సెబీ చీఫ్‌ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారంటూ వచ్చిన ఆరోపణల వ్యవహారంలో కేంద్రం ఆమెకు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఈ ఆరోపణల వ్యవహారంపై పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ ఇటీవల చేపట్టిన దర్యాప్తు ముగిసింది. అయితే, మాధబి గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ తప్పు చేసినట్లుగా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని సదరు వర్గాలు చెప్పినట్లు సమాచారం. అందువల్ల వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, మాధబి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. అదానీ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్‌ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు పెట్టారని గతంలో హిండెన్‌బర్గ్‌ చేసిన పోస్ట్‌ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెపై మరిన్ని ఆరోపణలు వచ్చాయి.

Tags:    

Similar News