Stock Market : ఆ స్టాక్స్ లో పెట్టుబడులపై జాగ్రత్త .. ఇన్వెస్టర్లను హెచ్చరించిన సెబీ

Update: 2024-08-29 15:30 GMT

స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్(ఎస్ఎంఈ) సంస్థలకు సంబంధించిన స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే వారికి సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ చేంజ్ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) హెచ్చరికలు జారీ చేసింది. ఎస్‌ఎం‌ఈ కంపెనీలు తమ కార్యకలాపాలకు సంబంధించి అవాస్తవాలను ప్రదర్శించి షేర్ల ధరల్లో అవకతవలకు పాల్పడుతున్నాయని పేర్కొంది. ఈ విభాగంలో పెట్టుబడులు పెట్టే ముందు ఇన్వెస్టర్లు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని బుధవారం ప్రకటన జారీ చేసింది. కొన్ని ఎస్‌ఎంఈ కంపెనీలు, సంబంధిత ప్రమోటర్లు స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ అయిన తర్వాత సంస్థ కార్యకలాపాలకు సంబంధించి సానుకూలంగా ప్రకటలు జారీచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు సెబీ ప్రకటనలో పేర్కొంది. ‘బోనస్‌ ఇష్యూలు, స్టాక్‌ స్ల్పిట్‌లు, ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌లు వంటి విషయాలకు సంబంధించిన ప్రకటనలు చేస్తున్నారు. ఇటువంటి చర్యలతో పెట్టుబడి దారులు సదరు కంపెనీల స్టాక్స్‌ పట్ల సానుకూలంగా ఉంటారు. దీంతో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేందుకు ముందుకొస్తారు. ఇలాంటి ప్రకటనలు విని సెక్యూరిటీల్లో పెట్టుబడి చేసేముందు జాగ్రత్త వహించాలి’అని కోరింది.

Tags:    

Similar News