Credit Cards : సినిమా టికెట్లపై భారీ తగ్గింపు..ఉచిత టికెట్లు ఇచ్చే టాప్ క్రెడిట్ కార్డులు ఇవే.
Credit Cards : సినిమా అంటే మన దేశంలో ఒక పండుగ. కానీ పెరిగిన టిక్కెట్ ధరలు, పాప్‌కార్న్ ఖర్చుల కారణంగా ప్రతి వారం సినిమా చూడటం జేబుకు భారం అవుతోంది. అయితే, సినిమా లవర్స్ కోసం మీ ఖర్చులను తగ్గించడానికి, స్మార్ట్‌గా సేవ్ చేసుకోవడానికి బ్యాంకులు అద్భుతమైన ఆఫర్లతో కూడిన క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఈ స్పెషల్ క్రెడిట్ కార్డుల ద్వారా మీరు ఉచిత టిక్కెట్‌లు 'ఒకటి కొంటే ఒకటి ఉచితం' (Buy 1 Get 1 Free) ఆఫర్లు భారీ తగ్గింపులను పొందవచ్చు. మీ జేబుకు చిల్లు పడకుండా ప్రతి నెలా సినిమా నైట్స్ ప్లాన్ చేసుకోవడానికి సహాయపడే టాప్ క్రెడిట్ కార్డుల వివరాలు తెలుసుకుందాం.
హెచ్‌డీఎఫ్‌సీ టైమ్స్ కార్డ్
హెచ్‌డీఎఫ్‌సీ టైమ్స్ కార్డ్‌ను ముఖ్యంగా సినిమా లవర్స్, లైఫ్‌స్టైల్ బెనిఫిట్స్ కోరుకునే వారి కోసం డిజైన్ చేశారు. బుక్‌మైషోలో టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రతి టిక్కెట్‌పై రూ.150 వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.350 వరకు, నెలకు గరిష్టంగా నాలుగు టిక్కెట్లపై ఈ తగ్గింపును ఉపయోగించుకోవచ్చు. ఈ కార్డుతో పాటు టైమ్స్ ప్రైమ్ మెంబర్‌షిప్, ఇతర లైఫ్‌స్టైల్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
యాక్సిస్ మై జోన్ కార్డ్
యాక్సిస్ మై జోన్ క్రెడిట్ కార్డ్ ముఖ్యంగా ఆన్‌లైన్ పేమెంట్స్, రెగ్యులర్‌గా సినిమా చూసే యువతకు అనుకూలంగా ఉంటుంది. ఈ కార్డుపై ప్రతి నెలా ఒక ఉచిత సినిమా టిక్కెట్‌ను (రూ.200 వరకు) పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్ పేటీఎం ద్వారా టిక్కెట్లు బుక్ చేసే వారికి వర్తిస్తుంది. సినిమా ఆఫర్లతో పాటు జోమాటో, స్పాటిఫై, మింత్రా వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లపై కూడా అదనపు తగ్గింపులు లభిస్తాయి.
ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్
ఎక్కువ సినిమాలు చూస్తూ, ఎక్కువ ఆదా చేసుకోవాలనుకునే వారికి ఎస్బీఐ కార్డ్ ఎలైట్ బెస్ట్ ఆప్షన్. ఈ కార్డుపై ఒకటి కొంటే ఒకటి ఉచితం ఆఫర్ లభిస్తుంది. ప్రతి టిక్కెట్‌పై రూ.250 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ నెలకు రెండు సార్లు వర్తిస్తుంది. దీని ద్వారా సంవత్సరానికి రూ.6,000 వరకు సులభంగా ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ బుక్‌మైషో ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి అందుబాటులో ఉంటుంది.
ఐసీఐసీఐ కోరల్ కార్డ్
అప్పుడప్పుడూ లేదా నెలకు ఒకటి రెండు సినిమాలు చూసే వారికి ఐసీఐసీఐ కోరల్ క్రెడిట్ కార్డ్ మంచి ఆప్షన్. ఈ కార్డుపై బుక్‌మైషో ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే 25% వరకు తగ్గింపు లభిస్తుంది. నెలకు రెండుసార్లు వరకు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రతి టిక్కెట్‌పై గరిష్టంగా రూ.100 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. సినిమా ఆఫర్లతో పాటు, రెస్టారెంట్‌లలో ప్రత్యేక డైనింగ్ ఆఫర్‌లు కూడా లభిస్తాయి.
స్మార్ట్ సేవింగ్స్ చిట్కాలు
ఈ కార్డులలో దేనినైనా ఎంచుకోవడం ద్వారా మీరు సినిమా టిక్కెట్లపై ప్రతి నెలా మంచి సేవింగ్స్ చేయవచ్చు. అయితే, ఏదైనా కార్డును ఎంచుకునే ముందు దాని నిబంధనలు షరతులను, ముఖ్యంగా వార్షిక ఫీజులు, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్ పరిమితులను తప్పక తెలుసుకోవాలి.