STARLINK: స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌..నెలకు రూ.3 వేలు?

భారతదేశంలో స్టార్‌లింక్‌ శాటిలైట్ ఇంటర్నెట్‌ సేవలకు అనుమతులు;

Update: 2025-06-10 03:00 GMT

భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్‌ సేవలకు మార్గం వేయబడింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ తాజాగా భారత టెలికం శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌) నుంచి కీలక అనుమతులు పొందింది. ఇప్పటికే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ (వన్‌వెబ్‌ ద్వారా) ఈ రంగంలోకి అడుగుపెట్టగా, ఇప్పుడు స్టార్‌లింక్‌ కూడా రంగంలోకి దిగుతోంది.

ఎంత ఖర్చు అవుతుంది?

విదేశాల్లో ఇప్పటికే సేవలు అందిస్తున్న స్టార్‌లింక్‌ ఇటీవల బంగ్లాదేశ్‌లోనూ కార్యకలాపాలు ప్రారంభించింది.

అక్కడి ధరల ప్రకారం:

హార్డ్‌వేర్‌ (టెర్మినల్/డిష్‌) ధర: సుమారు ₹33,000

నెలవారీ ప్లాన్‌: ₹3,000 నుంచి ప్రారంభం

భారతదేశంలోనూ ఇదే ధరలు ఉండొచ్చని CNBC-TV18 ఒక కథనంలో పేర్కొంది.

ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌తో పోలిస్తే చాలా ఖరీదు

ప్రస్తుతం భారత మార్కెట్‌లో...

జియో, ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి సంస్థలు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తున్నాయి.

100 Mbps వేగంతో అపరిమిత డేటాను నెలకు ₹1,000 లోపలే అందిస్తున్నాయి.

ఉచిత ఇన్‌స్టలేషన్‌, OTT & TV బండిళ్లు కూడా అందిస్తున్నారు. ఈ పరంగా చూస్తే, స్టార్‌లింక్ సేవలు ఖరీదైనవే. అయితే, వీటి ప్రత్యేకత పట్టణాల్లో కాకుండా – టెలికాం సేవలు అందని దూరప్రాంతాలు, కొండప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. స్టార్‌లింక్‌ సేవలు సంప్రదాయ శాటిలైట్ల నుంచి కాకుండా లో ఎర్త్‌ ఆర్బిట్‌ (LEO) శాటిలైట్లు ద్వారా అందిస్తాయి ఇవి భూమికి 550 కిలోమీటర్ల ఎగువన ఉంటాయి. ఇలాంటి శాటిలైట్లు స్టార్‌లింక్‌కు 7,000 ఉండగా.. క్రమంగా వీటి సంఖ్యను 40,000కు పెంచనుంది.

సేవలు మొదలవ్వాలంటే ఇంకా కొన్ని అనుమతులు అవసరం స్టార్‌లింక్‌తో సహా ఇతర లైసెన్స్ పొందిన సంస్థలు స్పెక్ట్రమ్ కేటాయింపులు కోసం ఎదురుచూస్తున్నాయి.

ట్రయల్ స్పెక్ట్రమ్‌...

రాబోయే రోజుల్లో స్టార్‌లింక్ ట్రయల్ స్పెక్ట్రమ్‌ను పొందవచ్చు. దీని కోసం, కంపెనీ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌లో పేర్కొన్న అన్ని భద్రతా నిబంధనలను నెరవేర్చాలి. స్పెక్ట్రమ్ కేటాయించే ముందు, స్టార్‌లింక్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుండి కూడా అనుమతి పొందాలి. దీని కోసం, కంపెనీ ఇప్పటికే తన పత్రాలను సమర్పించింది. భారత ప్రభుత్వం ఇటీవలే సాట్‌కామ్ ఆపరేటర్ల కోసం జాతీయ భద్రతా నియమాలను అమలు చేసింది. స్టార్‌లింక్ వీటిని పాటించడానికి అంగీకరించింది, ఆ తర్వాత DoT దీనికి ప్రాథమిక ఆమోదం తెలిపింది. వీటిలో తప్పనిసరి ఇంటర్‌సెప్షన్, మానిటరింగ్ సిస్టమ్‌లు, భారత్ లో డేటా సెంటర్‌లు, ట్రాకింగ్ సామర్థ్యం, స్థానిక సేవలు, మౌలిక సదుపాయాలతో సహా 29 కొత్త షరతులు ఉన్నాయి. భారత్‌లో తాను ప్రారంభించే ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవల టారి్‌ఫలను స్టార్‌లింక్‌ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల కోసం ఖాతాదారులు నెలకు కనీసం రూ.3,000 టారి్‌ఫగా చెల్లించాల్సి ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. **దీనికి తోడు హార్డ్‌వేర్‌ కోసం వన్‌టైమ్‌ చార్జీల కింద మరో రూ.33,000 (జీఎ్‌సటీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News