పార్లమెంటులో జమిలి ఎన్నిక బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులకు లోనవుతుంది. సెన్సెక్స్ 998 పాయింట్లు నష్టపోయి 80,757 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 291 పాయింట్లు నష్టపోయి 24,376 పాయింట్లతో కొనసాగుతోంది. వడ్డీ రేట్ల కోతపై కీలక సూచనలకు ఆస్కారమిచ్చే ఫెడ్ మానిటరీ పాలసీ మీటింగ్ Tue ప్రారంభంకావడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లపై FIIల ఇన్‌ఫ్లో తగ్గింది. పైగా క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో FII/FPIలు కొత్త పెట్టుబడులపై ఆసక్తిగా ఉన్నట్టు కనిపించడం లేదు. అంతేకాకుండా మార్కెట్లలో అస్థిరతను సూచించే INDIA VIX 14.49కి పెరగడం కూడా Selling Pressureకు కారణమైంది.