భారత స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 3939 పాయింట్లు నష్టపోయి 71,425, నిఫ్టీ 1,160 పాయింట్లు కోల్పోయి 21,743 వద్ద ప్రారంభమయ్యాయి. బ్యాంకు, ఫార్మా, ఐటీ రంగాల షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు రూ.19 లక్షల కోట్లు నష్టపోయారు. దీంతో నిపుణులు ఇవాళ బ్లాక్ మండేగా పేర్కొంటున్నారు.
ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత స్టాక్ మార్కెట్లు 3.9%, హాంకాంగ్- 8.7%, సింగపూర్- 7%, జపాన్- 6%, చైనా- 5.5%, మలేషియా- 4.2%, ఆస్ట్రేలియా- 4.1%, ఫిలిప్పీన్స్- 4%, న్యూజిలాండ్-3.6% నష్టపోయాయి. కొన్ని నెలల పాటు ఈ టారిఫ్స్ ఒడుదొడుకులు కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లకు దూరంగా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు.
భారత స్టాక్ మార్కెట్స్ సెషన్ ప్రారంభంలోనే సుమారు రూ.19 లక్షల కోట్లు కోల్పోయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 3939, నిఫ్టీ 1160 పాయింట్ల మేర నష్టాలతో ప్రారంభమయ్యాయి. 2020 మార్చి తర్వాత ఇదే అత్యల్పం. మొత్తంగా 5 శాతానికి పైగా సంపద ఆవిరైంది. ఐటీ, మెటల్ సూచీలు 7 శాతం నష్టపోయాయి. మరోవైపు చైనా, జపాన్, కొరియా తదితర దేశాల మార్కెట్లు సైతం కుప్పకూలాయి.