ట్రంప్ టారిఫ్ దెబ్బతో క్రితం సెషన్‌లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ఇవాళ కాస్త తేరుకుంటున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ.. దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో సూచీలు రాణిస్తున్నాయి. తొలుత సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. నిఫ్టీ మళ్లీ 22,500 మార్క్‌ను అందుకుంది. ప్రస్తుతం ఒత్తిళ్ళకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్ 7 వందలకు పైగా లాభంలో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 200 పాయింట్లు గెయిన్ అయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు క్షీణించి 85.83గా ట్రేడ్ అవుతోంది.