Stock Market : నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

Update: 2025-04-09 10:00 GMT

నిన్న భారీ లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు నేడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. చైనాపై టారిఫ్లను ట్రంప్ 104%కు పెంచడం ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 వద్ద కొనసాగుతున్నాయి. జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్ లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ టాప్ లూజర్. గత ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ₹710 పెరిగి ₹90,440కు, 22 క్యారెట్ల గోల్డ్ ₹650 పెరిగి ₹82,900కు చేరాయి. అటు వెండి ధర మాత్రం రూ.1000 తగ్గి కేజీ రూ.1,02,000 పలుకుతోంది.

Tags:    

Similar News