ఫైనాన్స్, మెటల్, ఆటో, ఫార్మా సహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడంతో స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడడంతో సెన్సెక్స్ 836 పాయింట్లు నష్టపోయి 79,541 వద్ద, నిఫ్టీ 284 పాయింట్ల నష్టంతో 24,199 వద్ద స్థిరపడ్డాయి. 24,180 పరిధిలో నిఫ్టీ, 79,420 పరిధిలో సెన్సెక్స్ సపోర్ట్ తీసుకుంటూ కన్సాలిడేట్ అయ్యాయి. హిందాల్కో షేర్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌లో 8.42% నష్టపోయాయి. యూఎస్‌కు చెందిన అనుబంధ సంస్థ Novelis Q2 లాభం 18 శాతం క్షీణించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే గత ఏడాది కాలంలో 165% రిటర్న్ ఇచ్చిన TRENT షేర్లు 6.12% నష్టపోయాయి. Q2 రిజల్ట్స్ 39% (YoY) మేర పెరిగినా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. అలాగే ఇతరత్రా లాభాలు తగ్గడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.