స్టాక్ మార్కెట్లు కుదురుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో మొదలైనా ప్రస్తుతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 280 పాయింట్ల లాభాల్లో కొనసాగుతుండగా నిఫ్టీ 82 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే రూ.2.10 లక్షల కోట్లు హరించుకుపోయాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు ఇవాళ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. గతేడాది ఏప్రిల్ 8న బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.400 లక్షల కోట్ల మార్క్‌ను అందుకుంది. గత సెప్టెంబర్ 27న జీవితకాల గరిష్టం రూ.479 లక్షల కోట్లకు చేరుకుంది. నాటి నుంచి నాటి నుంచి ఏకంగా రూ.81 లక్షల కోట్లు హరించుకుపోయింది.