Suzuki Access 125 : జీఎస్టీ సవరణ తర్వాత భారీగా తగ్గిన సుజుకీ యాక్సెస్ ధర
Suzuki Access 125 : మోటార్ సైకిళ్లు, స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడం వలన 350సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం గల టూ-వీలర్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ మార్పు కారణంగా, మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటైన సుజుకి యాక్సెస్ 125 ధర భారీగా తగ్గింది. తగ్గిన ధర, ఫీచర్లు, పోటీ గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లో 124సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 8.42 PS పవర్, 10.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది నగరంలో సులభమైన ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. ఈ స్కూటర్ వాస్తవ రోడ్డు పరిస్థితుల్లో లీటరుకు 50 నుంచి 55 కిమీ వరకు మెరుగైన మైలేజీని అందిస్తుంది. 5.3 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం ఈ స్కూటర్‌కు లాంగ్ రైడింగ్‌లో అనుకూలంగా ఉంటుంది.
యాక్సెస్ 125 కాంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు పలు లేటెస్ట్ ఫీచర్లతో నిండి ఉంది. ఇందులో డిజిటల్ LCD కన్సోల్, హై-ఎండ్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT డిస్‌ప్లే కూడా లభిస్తుంది. దీని ద్వారా నావిగేషన్, కాల్ అలర్ట్‌లు వంటి సమాచారం తెలుసుకోవచ్చు. ఇతర సౌకర్యాలలో ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, USB ఛార్జర్, ఆకర్షణీయమైన LED లైట్లు ఉన్నాయి.
ధర తగ్గిన తర్వాత యాక్సెస్ 125 తన ప్రత్యర్థులకు మరింత గట్టి పోటీ ఇవ్వనుంది. జీఎస్టీ తగ్గింపు కారణంగా హోండా యాక్టివా 125 ధర రూ.7,831 వరకు, టీవీఎస్ జుపిటర్ 125 ధర రూ.6,795 వరకు తగ్గాయి. ఈ సెగ్మెంట్‌లో టీవీఎస్ ఎన్ టార్క్ 125 , యమహా ఫాసినో 125 వంటి ఇతర మోడల్స్ కూడా ఉన్నాయి. అయితే, లీటరుకు 55కిమీ వరకు మైలేజ్, స్మూత్ పర్ఫామెన్స్, అత్యాధునిక ఫీచర్లతో సుజుకి యాక్సెస్ 125 ఇపుడు బడ్జెట్-ఫ్రెండ్లీ స్కూటర్‌ను కోరుకునే వారికి మంచి ఆప్షన్ గా నిలుస్తుంది.