Tata Nexon vs Kia Sonet : మైలేజీ మాయాజాలం..ఫీచర్ల జాతర..నెక్సాన్, సోనెట్ మధ్య తేడా తెలిస్తే షాక్ అవుతారు.
Tata Nexon vs Kia Sonet : భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా టాటా నెక్సాన్, కియా సోనెట్ మధ్య జరిగే పోరు టీమిండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ను తలపిస్తుంది. ఒకరు సేఫ్టీకి బ్రాండ్ అంబాసిడర్ అయితే, మరొకరు స్టైల్, టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్. ధర విషయంలో ఈ రెండు కార్లు దాదాపు పోటాపోటీగా ఉన్నాయి. టాటా నెక్సాన్ స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ మరియు ఫియర్‌లెస్ అనే నాలుగు ప్రధాన ట్రిమ్స్‌లో లభిస్తుంది. దీని ధర రూ.7.32 లక్షల నుంచి రూ.14.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇక కియా సోనెట్ విషయానికొస్తే.. ఇది ఏకంగా తొమ్మిది వేరియంట్లలో (HTE నుంచి X-Line వరకు) అందుబాటులో ఉంది. దీని బేస్ వేరియంట్ రూ.7.30 లక్షల వద్ద మొదలై, టాప్ వేరియంట్ రూ.13.65 లక్షల వద్ద ముగుస్తుంది. ధర పరంగా సోనెట్ కొంచెం తక్కువగా అనిపించినా, వేరియంట్ల పరంగా నెక్సాన్ ఎక్కువ ఆప్షన్లు ఇస్తోంది.
టాటా నెక్సాన్ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది:
1.2 లీటర్ టర్బో-పెట్రోల్ (118 hp)
1.2 లీటర్ టర్బో-పెట్రోల్ iCNG (98.6 hp)
1.5 లీటర్ డీజిల్ (113 hp). ఇందులో 5-స్పీడ్ నుంచి 7-స్పీడ్ డీసీఏ (DCA) వరకు వివిధ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
మరోవైపు కియా సోనెట్ కూడా మూడు ఇంజిన్లతో అలరిస్తోంది
1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (82 hp)
1.0 లీటర్ టర్బో-పెట్రోల్ (118 hp)
1.5 లీటర్ డీజిల్ (114 hp). సోనెట్‌లో ఐఎమ్‌టి (iMT), 6-స్పీడ్ ఆటోమేటిక్ వంటి వినూత్న ట్రాన్స్‌మిషన్లు ఉన్నాయి. ఇక్కడ పవర్ పరంగా నెక్సాన్ టర్బో ఇంజిన్ గంభీరంగా ఉంటే, సోనెట్ ఇంజిన్లు స్మూత్‌నెస్‌కు పేరుగాంచాయి.
మైలేజీ
మైలేజీ విషయంలో రెండు కార్లు వినియోగదారులను నిరాశపరచవు. నెక్సాన్ డీజిల్ వేరియంట్లు లీటరుకు 24.08 కి.మీ. వరకు మైలేజీ ఇస్తాయని కంపెనీ చెబుతోంది. పెట్రోల్ వేరియంట్లు 17.18 - 17.44 కి.మీ. మధ్య మైలేజీనిస్తాయి. ఇక కియా సోనెట్ మైలేజీ కింగ్ అని చెప్పాలి. దీని డీజిల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.1 కి.మీ. ఇస్తుండగా, పెట్రోల్ వేరియంట్లు 19.2 కి.మీ. వరకు మైలేజీనిస్తాయి. పొదుపుగా ప్రయాణించాలనుకునే వారికి సోనెట్ పెట్రోల్ వేరియంట్ మంచి ఎంపిక.
సేఫ్టీ వర్సెస్ ఫీచర్లు
టాటా నెక్సాన్: దీని మెయిన్ బలం సేఫ్టీ. 5-స్టార్ గ్లోబల్ ఎన్‌క్యాప్ రేటింగ్‌తో ఇది దేశంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది. 6 ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌సీ (ESC), డ్రైవర్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు దీని సొంతం. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా అద్భుతంగా ఉంటాయి.
కియా సోనెట్: ఇది ఫీచర్ల పుట్ట. కారు లోపల లగ్జరీని కోరుకునే వారికి సోనెట్ బెస్ట్. పెద్ద టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు (ముందు సీట్లకు గాలి వస్తుంది), ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్, ఎల్‌ఈడీ యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్లు ఉన్నప్పటికీ, వేరియంట్‌ను బట్టి అవి మారుతుంటాయి.