Tata Sierra : హారియర్ ఓడిపోయింది..టాటా సియెర్రాలో ఉన్న ఈ 5 అద్భుతమైన ఫీచర్లు ఏంటో తెలుసా?

Update: 2025-11-25 10:57 GMT

Tata Sierra : చాలా సంవత్సరాల క్రితం వచ్చిన సియెర్రా ఎస్‌యూవీ ఈ రోజు (నవంబర్ 25) కొత్త లుక్ మరియు అధునాతన ఫీచర్లతో భారతీయ రోడ్లపై మళ్లీ సందడి చేయడానికి వచ్చేసింది. టాటా మోటార్స్ తీసుకొస్తున్న ఈ ఐకానిక్ ఎస్‌యూవీలో చాలా ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కొన్ని ఫీచర్లు టాటా కంపెనీ మరో ప్రముఖ ఎస్‌యూవీ అయిన హారియర్‌లో కూడా లేవు.

1. ట్రిపుల్ స్క్రీన్ సెటప్

కొత్తగా వస్తున్న సియెర్రాలో ఉన్న ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి ట్రిపుల్ స్క్రీన్ సెటప్. ఇందులో డ్రైవర్ కోసం ఒక డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మధ్యలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పక్కనే కూర్చునే కో-డ్రైవర్ (ముందు ప్రయాణికుడి) కోసం ఒక ప్రత్యేక స్క్రీన్ కూడా ఉంటుంది. హారియర్‌లో కేవలం రెండు స్క్రీన్‌లు మాత్రమే ఉన్నాయి. సియెర్రా ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లో టాటా లేటెస్ట్ యూఐ (యూజర్-ఇంటర్‌ఫేస్) ఉంటుందని అంచనా.

2. ఎక్స్‌టెండబుల్ సన్ వైజర్

ఎండ నుంచి రక్షణ కల్పించే సన్ వైజర్ల విషయంలో సియెర్రా హారియర్ కంటే మెరుగ్గా ఉంది. సియెర్రాలో ముందు సీట్ల కోసం ఎక్స్‌టెండబుల్ సన్ వైజర్‌లను ఇచ్చారు. మామూలు సన్ వైజర్లతో పోలిస్తే, ఈ మెకానిజం కారణంగా డ్రైవర్, కో-డ్రైవర్లను వేడి ఎండ నుంచి ఇది బాగా రక్షిస్తుంది.

3. ఎక్కువ స్పీకర్లు, సౌండ్‌బార్

సౌండ్ సిస్టమ్ పరంగా కూడా సియెర్రా లగ్జరీ అనుభూతిని ఇస్తుంది. సియెర్రా, హారియర్ రెండింటిలోనూ జేబీఎల్ బ్రాండెడ్ సౌండ్ సిస్టమ్ ఉంది. హారియర్‌లో 10 స్పీకర్ల సిస్టమ్ ఉండగా, సియెర్రాలో ఏకంగా 12 స్పీకర్ల సెటప్ ఉంది. అదనంగా కొత్త సియెర్రాలో క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ పైన ఒక ప్రత్యేకమైన సౌండ్‌బార్ కూడా ఉంది. ఈ రెండు ఫీచర్లు సియెర్రాకు మెరుగైన ఆడియో క్వాలిటీని అందిస్తాయి.

4. ఆగ్జిలియరీ టెయిల్ ల్యాంప్

సేఫ్టీ విషయంలో సియెర్రాలో కొత్త ఫీచర్ ఉంది. టాటా హారియర్‌లో లేని ఆగ్జిలియరీ టెయిల్ ల్యాంప్‌ను సియెర్రాలో మొదటిసారిగా తీసుకొస్తున్నారు. కారు వెనుక డోర్ (టెయిల్‌గేట్) తెరిచి ఉన్నప్పుడు కూడా, వెనుక నుంచి వచ్చే వారికి కారు స్పష్టంగా కనిపించడానికి ఈ ల్యాంప్ సహాయపడుతుంది. దీనివల్ల రాత్రిపూట భద్రత పెరుగుతుంది.

5. ఎక్స్‌టెండెడ్ తై సపోర్ట్

కంఫర్ట్ విషయంలో సియెర్రా హారియర్ కంటే చాలా మెరుగ్గా ఉంది. సియెర్రాలో మొదటిసారిగా ప్రయాణికులకు ఎక్స్‌టెండెడ్ తై సపోర్ట్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇది సీట్ బేస్‌నుంచి ఫోల్డ్-అవుట్ ఎక్స్‌టెన్షన్‌లా పనిచేస్తుంది. అవసరాన్ని బట్టి దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. దీనివల్ల సుదూర ప్రయాణాల్లో కాళ్లకు మెరుగైన సపోర్ట్ లభిస్తుంది. ప్రయాణం మరింత సుఖవంతంగా ఉంటుంది.

Tags:    

Similar News