Tata Motors : టాటా సియెరా స్పెషల్ ఫీచర్..మొట్టమొదటిసారిగా 3 స్క్రీన్‌లతో రాబోతున్న ఎస్‌యూవీ ఇదే.
Tata Motors : ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్‌యూవీ మోడల్ టాటా సియెరా కోసం ఎదురుచూపులు పెరిగాయి. నవంబర్ 25, 2025న ఈ కారు మార్కెట్‌లోకి రానున్న నేపథ్యంలో టాటా మోటార్స్ తాజాగా సియెరాకు సంబంధించిన మరో టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో ప్రధానంగా దృష్టిని ఆకర్షించే అంశం- ఈ కారులో మొట్టమొదటిసారిగా అందించనున్న ట్రిపుల్ స్క్రీన్ సెటప్. లోపల భాగం అద్భుతంగా డిజైన్ చేయబడి, అడ్వాన్సుడ్ ఫీచర్లతో నిండిన ఈ సియెరా విశేషాలేంటో చూద్దాం.
టాటా మోటార్స్ విడుదల చేసిన టీజర్‌లో రాబోయే సియెరా ఎస్‌యూవీ రెడ్ కలర్లో మెరుస్తూ, దాని లోపలి భాగంలో ఉన్న సరికొత్త ఫీచర్‌ను వెల్లడించింది. ఇది టాటా మోటార్స్ నుంచి మూడు స్క్రీన్‌లను కలిగి ఉన్న మొదటి కారు అవుతుంది. ఇందులో మధ్యలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం డిజిటల్ డిస్‌ప్లే, ముందు కూర్చున్న ప్రయాణీకుడి కోసం స్పెషల్ స్క్రీన్ ఉంటాయి. సియెరా ఇంటీరియర్ డిజైన్ లగ్జరీ, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తూ రూపొందించారు. ఈ కారులో మెరిసే టాటా లోగో, కంట్రోల్ బటన్‌లతో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది.
ప్రీమియం సీట్ కవర్లు, డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటో డిమ్మింగ్ మిర్రర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 360-డిగ్రీ కెమెరాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా.
https://x.com/TataMotors_Cars/status/1986004667957178517?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1986004667957178517|twgr^069d482e24c3aae0fdb8e108ab418a1d3636ad7b|twcon^s1_&ref_url=https://www.tv9hindi.com/automobile/tata-sierra-will-be-company-first-car-to-feature-three-screens-and-advanced-interior-3558885.html
టాటా సియెరా రోబోస్టిక్ పవర్ ఫుల్ డిజైన్‌తో రాబోతుంది. అనేక ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. సియెరాలో SIERRA అని రాసి ఉన్న బ్లాక్ క్లోజ్డ్ గ్రిల్, స్ట్రాంగ్ బాడీ లుక్, మందపాటి B-పిల్లర్లు, రూఫ్ రైల్స్, ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ లైట్ బార్, 19-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, సిల్వర్ స్కఫ్ ప్లేట్‌లు వంటి డిజైన్ అంశాలు ఉన్నాయి. ఈ కారులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్ కలిపి నాలుగు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులోకి రావచ్చు. సియెరా EVలో 55kWh, 65kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉండవచ్చు, ఇవి 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వగలవు.
టాటా సియెరా ఐసీఈ(ఇంటర్నల్ కంబుషన్ ఇంజన్) , ఈవీ విభాగాలలో అనేక ప్రత్యర్థి కార్లతో పోటీ పడనుంది. సియెరా ఐసీఈ వెర్షన్ ధర రూ.11 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండవచ్చు. ఈ ధర పరిధిలో ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి కార్లతో పోటీపడుతుంది. సియెరా ఈవీ ధర సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉండవచ్చు. ఇది మహీంద్రా బీఈ 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి వాటికి ప్రత్యర్థిగా నిలుస్తుంది.