Tata vs Mahindra : టాటా vs మహీంద్రా ఫైట్.. సియెర్రా, XEV 9S ఎంట్రీ—SUV లవర్స్‌కి ఇది సూపర్ వీక్.
Tata vs Mahindra : భారతదేశంలో ఆటోమొబైల్ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా .. ఈ నవంబర్ 2025 నెల చివరలో మార్కెటును మరింత ఉత్సాహంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు అద్భుతమైన SUVలు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. టాటా మోటార్స్ తమ పాత సూపర్ హిట్ ఎస్యూవీ అయిన టాటా సియెర్రా ను ICE (పెట్రోల్/డీజిల్), ఎలక్ట్రిక్ మోడళ్లలో తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు మహీంద్రా తమ బోర్న్ ఎలక్ట్రిక్ సిరీస్‌లో మూడవ ఎలక్ట్రిక్ కారు మహీంద్రా XEV 9S ను విడుదల చేయనుంది. ఎస్యూవీ లవర్స్కు ఇది నిజంగా సూపర్ వీక్ అనే చెప్పాలి.
టాటా సియెర్రా
కొత్త జనరేషన్ టాటా సియెర్రా ఇండియన్ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్లలో ఒకటి. 90ల కాలంలో భారత మార్కెట్‌లో లాంచ్ అయిన మొదటి SUVలలో సియెర్రా ఒకటి. కొత్త మోడల్ దాని వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతుంది. టాటా మోటార్స్ పాత డిజైన్ ఫిలాసఫీని కొనసాగిస్తూనే, లేటెస్ట్ స్టైలింగ్ అంశాలతో కొత్త లుక్ ఇచ్చింది. ఇది ప్రీమియం SUVగా ఉండేందుకు డాష్‌బోర్డ్‌పై మల్టీ-స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది. ఇది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ సహా పలు పవర్‌ట్రైన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంజిన్ ఆప్షన్లలో 1.5-లీటర్ TGDi టర్బో-పెట్రోల్, 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ మోటార్‌లు ఉన్నాయి. టాటా మోటార్స్ నవంబర్ 25న ఈ SUVని లాంచ్ చేయనుంది.
మహీంద్రా XEV 9S
మహీంద్రా నుంచి రాబోతున్న ముఖ్యమైన ఈవీ మోడళ్లలో XEV 9S ఒకటి. ఈ వాహనం INGLO ఆర్కిటెక్చర్ పై ఆధారపడి ఉంటుంది. ఇది XEV 9e కూపే తరహా వేరియంట్ అని, అలాగే XUV 700 ఎలక్ట్రిక్ అవతార్ అని కూడా భావిస్తున్నారు. XEV 9e, BE 6 వంటి ఇతర బోర్న్ ఎలక్ట్రిక్ కార్ల డిజైన్ అంశాలను XEV 9S కూడా కలిగి ఉంటుంది. ఇది బోల్డ్, పవర్ఫుల్ డిజైన్‌తో వస్తుంది. ఇది రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను ఇస్తుందని మహీంద్రా హామీ ఇస్తోంది. దీని టాప్ వేరియంట్‌లు డ్యుయల్-మోటార్ AWD (ఆల్-వీల్ డ్రైవ్) సెటప్‌తో వస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండబోతోంది. మహీంద్రా ఈ XEV 9Sను నవంబర్ 26న లాంచ్ చేయనుంది.