అదానీ గ్రూప్, సెబీ చీఫ్ మాధబిపై ఆరోపణలతో రిపోర్టులిచ్చిన హిండెన్‌బర్గ్ మూతపడనుంది. కంపెనీని శాశ్వతంగా షట్‌డౌన్ చేస్తున్నట్టు యజమాని నేట్ అండర్సన్ ప్రకటించారు. షార్ట్ సెల్లింగ్ చేశాక ఆ కంపెనీలపై నివేదికలిచ్చి ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచి, తర్వాత తక్కువ ధరకు షేర్లను కొని లాభపడటమే దాని పని. రీసెర్చ్ ఐడియాలన్నీ అయిపోయాయని, రెస్ట్ తీసుకుంటానంటున్న నేట్ సరిగ్గా ట్రంప్ రాకముందే షట్‌డౌన్ చేయడం గమనార్హం.
ఆమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ షట్‌డౌన్ టైమింగ్‌పై చాలామందికి డౌట్ వస్తోంది.జనవరి 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు. కొన్ని రోజుల క్రితమే హౌస్ జుడీషియరీ కమిటీలోని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడొకరు అదానీ, అతడి కంపెనీలపై కమ్యూనికేషన్, దర్యాప్తు పత్రాలు, ఆధారాలన్నీ పరిరక్షించాలని కోరారు. ఇక హిండెన్‌బర్గ్‌కు డీప్‌స్టేట్, డెమోక్రాట్స్, జార్జ్ సొరోస్, చైనా ఇంటెలిజెన్స్ సహకారంపై ఆరోపణలు ఉన్నాయి.