Tata Sierra : లెజెండరీ టాటా సియెర్రా ఈజ్ బ్యాక్.. డీలర్‌షిప్‌లలో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.
Tata Sierra : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు లెజెండరీ స్థానం సంపాదించుకున్న టాటా సియెర్రా ఎస్‌యూవీ తిరిగి వస్తోంది. ఈ కారు అధికారికంగా నవంబర్ 25, 2025న లాంచ్ కానుంది. అయితే, అంతకంటే ముందే కొన్ని టాటా డీలర్‌షిప్‌లలో ఈ కొత్త సియెర్రా కోసం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
టాటా సఫారీ తర్వాత, భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్‌యూవీ టాటా సియెర్రా. ఇది నవంబర్ 25, 2025న అధికారికంగా లాంచ్ కానుంది. అంతకంటే ముందే కొన్ని టాటా డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి టాప్ కార్లకు సియెర్రా గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రత్యేకంగా, సియెర్రా మొదటి బ్యాచ్‌ను భారత మహిళల ప్రపంచ కప్ విజేత జట్టుకు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ప్రారంభంలో కొత్త టాటా సియెర్రా కేవలం ICE (పెట్రోల్/డీజిల్) పవర్‌ట్రైన్‌లతో మాత్రమే రానుంది. తక్కువ వేరియంట్‌లలో కొత్త 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ వస్తుంది. హై ఎండ్ వేరియంట్‌లలో పవర్ఫుల్ కొత్త 1.5 లీటర్ TGDi (టర్బో గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్) ఇంజిన్ ఉంటుంది. ఈ టర్బో-పెట్రోల్ ఇంజిన్ సుమారు 170PS పవర్, 280Nm టార్క్‌ను అందించే అవకాశం ఉంది.
ఇందులో నెక్సాన్ నుంచి తీసుకున్న 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉండవచ్చు, కానీ దీనిని మరింత మెరుగైన పనితీరు కోసం ట్యూన్ చేయనున్నారు. ఇది 6-స్పీడ్ మాన్యువల్, కొత్త 7-స్పీడ్ డీసీటీ (DCT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది.
కొత్త టాటా సియెర్రా ఫీచర్ల పరంగా లగ్జరీ కార్లకు ధీటుగా ఉంది. ఇందులో అనేక కీలకమైన ఫీచర్లు ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్‌లో ట్రిపుల్ స్క్రీన్‌లు (ఒక్కొక్కటి దాదాపు 12.3 అంగుళాలు), పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ ఆటో ఏసీ, ప్రీమియం జేబీఎల్ సౌండ్ సిస్టమ్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, నాలుగు స్పోక్స్ ఉన్న స్టీరింగ్ వీల్, లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), ముందు వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు ఉన్నాయి.
2025 టాటా సియెర్రా డిజైన్ పాత సియెర్రాకు భిన్నంగా ఆధునికతను జోడించింది. ముందు భాగంలో, సన్నని కనెక్టెడ్ LED DRL లు,హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద ఎయిర్ డ్యామ్, 'SIERRA' బ్యాడ్జింగ్ హైలైట్‌గా నిలుస్తాయి. బాహ్య డిజైన్‌లో ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ రూఫ్ రెయిల్స్, ఆకర్షణీయమైన డ్యూయల్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్‌ల్యాంప్‌లు దీనికి ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.