ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి మళ్ళీ గట్టి ఎదురుదెబ్బ తెగిలింది. రిలయన్స్ పవర్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలపై మూడేళ్లపాటు టెండర్లలో బిడ్డింగ్ చేయకుండా 'సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' నిషేధం విధించింది. నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించినట్లు తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ తన టెండర్ ప్రక్రియలో భాగంగా జూన్‌లో 1 గిగావాట్ సోలార్ పవర్, 2 గిగావాట్ స్టాండలోన్ బ్యాటరీ ఎనర్జీ వంటి వాటికి బిడ్‌లను ఆహ్వానించింది. ఆ సమయంలో అనిల్ అంబానీకి చెందిన సంస్థలు నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేయడం మాత్రమే కాకుండా.. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ సమర్పించిన బిడ్‌ను రద్దు చేసి నిషేధం విధించింది.