వాహనదారులకు ఝలక్.. మరి కాస్త పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటుండడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.

Update: 2021-02-12 03:00 GMT

దేశంలో ప్రతిరోజూ మారుతున్న పెట్రో ధరలు వాహనదారులకు ఝలక్ ఇస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటుండడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో వాహనాలు బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

హైదరాబాద్‌లో శుక్రవారం (12-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.91.35గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.85.116 గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.85గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 78.03గా ఉంది.

ఇక కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.16గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.81.61గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.366గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 84.94 గా ఉంది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.18గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.83.18గా ఉంది.

బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.78గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 82.72గా ఉంది.

ఒడిశా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.38గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.84.86గా ఉంది.

జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.74గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.86.72గా ఉంది





Tags:    

Similar News