Upcoming SUVs : SUVల జాతర మొదలు.. 2026లో రాబోతున్న 10 అదిరిపోయే కార్లు.
Upcoming SUVs : ఆటోమొబైల్ లవర్లకు 2026 ఒక అద్భుతమైన ఏడాది కాబోతోంది. మార్కెట్లోకి కొత్త ఎస్‌యూవీల వెల్లువ రాబోతోంది. టాటా, మహీంద్రా, మారుతి సుజుకి వంటి దిగ్గజ కంపెనీలు తమ పవర్‌ఫుల్ మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాయి. వచ్చే 12 నెలల్లో భారత రోడ్లపై సందడి చేయబోయే టాప్ 10 ఎస్‌యూవీల వివరాలు తెలుసుకుందాం.
టాటా ఎలక్ట్రిక్ పవర్: సియెర్రా, పంచ్, అవిన్యా టాటా మోటార్స్ తన ఈవీ సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఐకానిక్ బ్రాండ్ టాటా సియెర్రా ఈవీ జనవరి 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని అంచనా. దీనితో పాటు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో వస్తున్న కొత్త పంచ్ ఈవీ, లగ్జరీ విభాగంలో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతున్న అవిన్యా సిరీస్ కార్లు 2026లో ఆటో మార్కెట్‌ను ఒక ఊపు ఊపనున్నాయి.
మారుతి , మహీంద్రా కొత్త స్కెచ్‌లు : మారుతి సుజుకి తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ e విటారాను జనవరి 15, 2026న లాంచ్ చేయబోతోంది. ఇది ఇప్పటికే క్రాష్ టెస్టింగ్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించి భద్రతలో మేటి అనిపించుకుంది. ఇక మహీంద్రా విషయానికి వస్తే, తన పాపులర్ XUV 700ను XUV 7XO పేరుతో రీబ్రాండ్ చేసి జనవరి 5న విడుదల చేయనుంది. ఇందులో విమానాల్లో ఉండే తరహాలో ట్రిపుల్ డిస్క్రీ స్క్రీన్ సెటప్, బాస్ మోడ్ వంటి హైటెక్ ఫీచర్లు ఉండబోతున్నాయి.
రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ : కియా సెల్టోస్ కొత్త అవతారం చాలా కాలంగా ఎదురుచూస్తున్న రెనాల్ట్ డస్టర్ కొత్త తరం మోడల్ జనవరి 26, 2026న భారత్‌లో అడుగుపెట్టనుంది. దీనికి పోటీగా నిస్సాన్ నుంచి టెక్టన్ కూడా రాబోతోంది. ఇక కియా ఇండియా తన సెన్సేషనల్ హిట్ సెల్టోస్ ను సరికొత్త డిజైన్, K3 ప్లాట్‌ఫారమ్‌పై జనవరి 2న లాంచ్ చేస్తోంది. హ్యుందాయ్ కూడా తన బడ్జెట్ ఈవీ విభాగంలో ఇన్‌స్టర్ ఆధారిత కాంపాక్ట్ EVని జూన్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.