Top Selling Cars : కార్ల మార్కెట్లో ఎస్‌యూవీల సునామీ..టాటా పంచ్, నెక్సాన్ ధాటికి మారుతి కోటలు బద్ధలు.

Update: 2026-02-05 08:30 GMT

Top Selling Cars : భారత ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీల హవా ఏమాత్రం తగ్గడం లేదు. జనవరి 2026 కార్ల విక్రయాల గణాంకాలు చూస్తుంటే, భారతీయ కస్టమర్లు మళ్లీ టాటా మోటార్స్, మారుతి సుజుకి వైపే మొగ్గు చూపారని అర్థమవుతోంది. ముఖ్యంగా టాటా నెక్షాన్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా, మారుతి డిజైర్ కూడా గట్టి పోటీనిచ్చింది. జనవరి 2026 నెలలో భారతీయ కార్ల మార్కెట్ కొత్త ఉత్సాహంతో దూసుకుపోయింది. మొత్తం 15 అత్యధిక విక్రయాలు సాధించిన కార్ల జాబితాలో టాటా నెక్సాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 23,365 యూనిట్ల విక్రయాలతో నెక్షాన్ తన సత్తా చాటింది. ఇందులో నెక్సాన్ ఈవీ వెర్షన్లు కూడా ఉండటం విశేషం. గతేడాది జనవరితో పోలిస్తే నెక్సాన్ డిమాండ్ ఏకంగా 52 శాతం పెరగడం చూస్తుంటే, కస్టమర్లు సేఫ్టీ, ఫీచర్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోంది.

మారుతి డిజైర్, టాటా పంచ్ ల మధ్య హోరాహోరీ!

ఎస్‌యూవీల హవా ఉన్నప్పటికీ, సెడాన్ విభాగంలో మారుతి డిజైర్ తన పట్టును కోల్పోలేదు. 19,629 యూనిట్లతో ఈ కారు రెండో స్థానంలో నిలిచింది. ఫ్యామిలీ కార్ గానే కాకుండా, ట్యాక్సీ, ఫ్లీట్ మార్కెట్లో దీనికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా ఇది టాప్ 15 జాబితాలో నిలకడగా కొనసాగుతోంది. ఇక మూడో స్థానంలో టాటా పంచ్ నిలిచింది. మైక్రో ఎస్‌యూవీ విభాగంలో తిరుగులేని ఈ కారు, సుమారు 19,257 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇటీవల వచ్చిన కొత్త అప్‌డేట్స్ పంచ్ అమ్మకాలకు మరింత బూస్ట్ ఇచ్చాయి.

క్రెటా, అకట్టుకుంటున్న ఎంపీవీలు

కాంపాక్ట్ ఎస్‌యూవీల కింగ్ గా పిలువబడే హ్యుందాయ్ క్రెటా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఎలక్ట్రిక్, ఎన్-లైన్ వెర్షన్లతో కలిపి క్రెటా 17,921 యూనిట్ల సేల్స్ సాధించి నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు, ఫ్యామిలీ ఎంపీవీ విభాగంలో మారుతి అరిగా రికార్డు సృష్టించింది. దాదాపు 18,000 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. అటు ప్రైవేట్ యజమానులు, ఇటు కమర్షియల్ ఆపరేటర్లు అరిగాను మొదటి ఛాయిస్ గా ఎంచుకుంటున్నారు.

మహిళల మనుసు గెలిచిన మహీంద్రా

ఈసారి జాబితాలో మహీంద్రా కార్లు కూడా సత్తా చాటాయి. మహీంద్రా స్కార్పియో, మహీంద్రా థార్ (థార్ రాక్స్ తో కలిపి) టాప్ 15లో నిలిచాయి. ముఖ్యంగా థార్ విక్రయాలు గతేడాది కంటే రెట్టింపు అవ్వడం గమనార్హం. అయితే, గతంలో నంబర్ 1 స్థానంలో ఉండే మారుతి వాగన్ ఆర్ కు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది కంటే దీని అమ్మకాలు 37 శాతం పడిపోయాయి. బహుశా కస్టమర్లు హ్యాచ్‌బ్యాక్ ల కంటే ఎస్‌యూవీల వైపే ఎక్కువ మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణం కావచ్చు. మారుతి ఆల్టో చిట్టచివరి స్థానంలో నిలిచి, టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో తన ఉనికిని చాటుకుంది.

Tags:    

Similar News