Top 5 Affordable Bikes : మైలేజ్ కింగ్స్... యాక్టీవా కంటే తక్కువ ధరకే దొరికే టాప్ 5 బైక్స్ ఇవే.

Update: 2025-11-26 11:00 GMT

Top 5 Affordable Bikes : భారత మార్కెట్‌లో స్కూటర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు హోండా యాక్టివా. అయితే, స్కూటర్ల కంటే బైక్‌లనే ఎక్కువగా ఇష్టపడేవారు, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి శుభవార్త. యాక్టివా బేస్ వేరియంట్ ధర సుమారు రూ.74,619 (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఈ ధర కంటే తక్కువలోనే బజాజ్, టీవీఎస్, హీరో, హోండా వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి అద్భుతమైన మైలేజ్ ఇచ్చే 5 బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ధరల పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ బైక్స్ కుటుంబాలకు చాలా ఉపశమనం ఇస్తాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

టీవీఎస్ రేడియన్ : ఈ బైక్ ధర రూ.55,100 నుంచి మొదలవుతుంది. ఇందులో 109.7సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది ఒక లీటరుకు దాదాపు 73.68 కి.మీ మైలేజ్ ఇస్తుంది. మైలేజ్ పరంగా ఇది అద్భుతమైన ఎంపిక.

బజాజ్ ప్లాటినా 100 : దీని ధర రూ.65,407 నుంచి మొదలవుతుంది. ఈ బైక్‌లో 99.59 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది ఒక లీటరుకు సుమారు 70 కి.మీ దూరం ప్రయాణించగలదు.

టీవీఎస్ స్పోర్ట్ : ఈ బైక్ ధర రూ.55,100 నుంచి మొదలవుతుంది. ఇందులో 109.7 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది కూడా ఒక లీటరుకు సుమారు 70 కి.మీ మైలేజ్ ఇవ్వగలదు.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ : హీరో మోటోకార్ప్ ఈ బైక్ ధర రూ.55,992 నుంచి మొదలవుతుంది. ఇందులో 97.2 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఈ బైక్ ఒక లీటరుకు 65 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. హీరో బ్రాండ్‌కు ఉన్న నమ్మకం, దేశవ్యాప్తంగా సర్వీస్ సెంటర్లు దీనికి అదనపు బలం.

హోండా షైన్ 100 : యాక్టివా తయారీదారు అయిన హోండా నుంచి వచ్చిన ఈ బైక్ ధర రూ.63,441 నుంచి మొదలవుతుంది. ఇందులో 98.98 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది కూడా ఒక లీటరుకు 65 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

ఈ ఐదు బైక్‌లు కేవలం తక్కువ ధరకే కాకుండా, రోజువారీ ప్రయాణాలకు, బడ్జెట్‌ను పరంగా కూడా ఫ్యామిలీలకు బెస్ట్ ఆప్షన్లు. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, దేశవ్యాప్తంగా సులభంగా దొరికే విడిభాగాలు ఈ బైక్‌లను వినియోగదారులకు మరింత చేరువ చేస్తాయి. యాక్టివాతో పోలిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి ఈ బైకులు బెస్ట్ ఛాయిస్ అవుతాయి.

Tags:    

Similar News