Citroen : సిట్రోయెన్ సరికొత్త ప్లాన్..ఇక నుంచి బుక్ చేసుకుంటేనే కారు రెడీ.

Update: 2026-01-24 17:00 GMT

Citroen : ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ భారత మార్కెట్లో సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. సాధారణంగా కార్లు తయారయ్యాక షోరూమ్‌లకు వస్తాయి. కానీ సిట్రోయెన్ మాత్రం ముందు బుక్ చేసుకోండి.. ఆ తర్వాతే మేము తయారు చేస్తాం అనే కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీనిని డిమాండ్ బేస్డ్ ప్రొడక్షన్ అని పిలుస్తారు. అంటే కస్టమర్ ఆర్డర్ ఇస్తే తప్ప ఆ కారు ఫ్యాక్టరీలో తయారవ్వదు. ఈ వినూత్న పద్ధతిలో కంపెనీ రెండు కొత్త మోడళ్లను లాంచ్ చేసింది. సిట్రోయెన్ తన సిట్రోయెన్ 2.0 వ్యూహంలో భాగంగా, కేవలం కస్టమర్ల నుంచి కన్ఫర్మ్ బుకింగ్ వచ్చిన తర్వాతే వాహనాన్ని తయారు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల వేస్ట్ తగ్గుతుందని, కస్టమర్లకు లేటెస్ట్ ఫీచర్లతో కూడిన కారు అందుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ ప్రొడక్షన్ మోడల్ కింద సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ X మ్యాక్స్ టర్బో (5-సీటర్), సిట్రోయెన్ C3 లైవ్ (O) వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చింది.

సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ X మ్యాక్స్ టర్బో ఫీచర్లు

ఈ కారును సౌకర్యానికి మారుపేరుగా తీర్చిదిద్దారు. ఇందులో వెనుక సీటు ప్రయాణికుల కోసం కప్ హోల్డర్లతో కూడిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్, మూడు దశల రిక్లైనింగ్ సీట్ ఫంక్షన్ ఉన్నాయి. అంతేకాకుండా, వెనుక సీటులో లెగ్ రూమ్ (మోకాళ్ల దగ్గర ఖాళీ) మరో 60 మి.మీ పెంచారు. ఇది డీప్ ఫారెస్ట్ గ్రీన్, పోలార్ వైట్, పెర్లా నెరా బ్లాక్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. లోపల ఇంటీరియర్ థీమ్ కూడా డార్క్ బ్రౌన్ రంగులో చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.41 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

సిట్రోయెన్ C3 లైవ్ (O) విశేషాలు

తొలిసారి కారు కొనేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌ను డిజైన్ చేశారు. కేవలం రూ.5.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉన్న ఈ కారులో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి. లెథరెట్ సీట్లు, రియర్ వ్యూ కెమెరా, బయట డిజైన్‌లో క్రోమ్ ఫినిషింగ్ వంటివి దీనికి లగ్జరీ లుక్‌ను ఇస్తాయి. అయితే ఈ వేరియంట్ కేవలం పెర్లా నెరా బ్లాక్ రంగులో మాత్రమే దొరుకుతుంది.

Tags:    

Similar News