Ultraviolette : అల్ట్రావాయిలెట్ అదిరిపోయే ఆఫర్.. రూ.1.49 లక్షలకే ఎలక్ట్రిక్ బైక్ మీ సొంతం.

Update: 2026-03-06 09:30 GMT

Ultraviolette : భారతదేశపు ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో విప్లవాత్మక మార్పులు మొదలయ్యాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ అల్ట్రావాయిలెట్ తన సరికొత్త బ్యాటరీ ఫ్లెక్స్ పథకాన్ని ప్రకటించింది. దేశంలోనే మొదటిసారిగా బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ మోడల్‌ను పరిచయం చేస్తూ, ఈవీ బైక్ ధరను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో పనిచేస్తున్న ఎన్‌బీఎఫ్‌సీ ఇకోఫీ భాగస్వామ్యంతో ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల అత్యాధునిక ఎలక్ట్రిక్ బైక్ కొనడం ఇప్పుడు మొబైల్ ఫోన్ ఈఎంఐ కట్టినంత సులభం కానుంది.

సాధారణంగా ఎలక్ట్రిక్ బైక్ కొనాలంటే బ్యాటరీ ఖర్చు వల్ల లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. కానీ అల్ట్రావాయిలెట్ కొత్త ప్లాన్ ప్రకారం, మీరు కేవలం బైక్ బాడీ (ఛాసిస్) ధరకు మాత్రమే డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల Ultraviolette X-47 Crossover బైక్ ధర ఏకంగా 40 శాతం తగ్గింది. అంటే, రూ.2.5 లక్షల విలువైన ఈ బైక్‌ను మీరు కేవలం రూ.1,49,000 లకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. మిగిలిన బ్యాటరీ ధరను నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూపంలో చెల్లించే వెసులుబాటు కల్పించారు.

బ్యాటరీ కోసం వినియోగదారులు నెలకు కేవలం రూ.2,499 చెల్లిస్తే సరిపోతుంది. ఇది సగటు పెట్రోల్ బైక్ ఖర్చు కంటే చాలా తక్కువ. ఈ పథకంలో మరో అద్భుతమైన విషయం ఏమిటంటే.. మీ సబ్‌స్క్రిప్షన్ కాలపరిమితి ముగిసిన తర్వాత, బ్యాటరీపై పూర్తి యాజమాన్య హక్కులు అదనపు ఖర్చు లేకుండానే కస్టమర్‌కు బదిలీ అవుతాయి. అంటే వాడుకున్నన్ని రోజులు అద్దె కట్టినట్లు కాకుండా, చివరికి బ్యాటరీ మీ సొంతం అవుతుందన్నమాట. దీనివల్ల బ్యాటరీ లైఫ్ గురించి లేదా రీప్లేస్‌మెంట్ గురించి ఎటువంటి టెన్షన్ ఉండదు.

కస్టమర్ల నమ్మకాన్ని పెంచేందుకు బ్యాటరీ ప్యాక్‌పై 5 ఏళ్ల వారంటీని కూడా కంపెనీ అందిస్తోంది. దీనివల్ల బ్యాటరీ మెయింటెనెన్స్ బాధ్యత కంపెనీదే అవుతుంది. ఈ బ్యాటరీ ఫ్లెక్స్ ప్లాన్ కోసం రిజిస్ట్రేషన్లు మార్చి 5, 2026 నుంచి ప్రారంభమయ్యాయి. తక్కువ పెట్టుబడితో హై-పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అనుభూతిని పొందాలనుకునే యువతకు ఇది ఒక సువర్ణావకాశం. ఈ నిర్ణయం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News