మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్
కోట్ల రూపాయల విలువైన డీల్ కు బ్రేక్ ఇచ్చిన అమెరికా ఫెడరల్ కోర్ట్;
టెక్ దిగ్గజమైన టెన్సెంట్, జపాన్ ప్లే స్టేషన్ తయారీదారు సోనీ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద గేమింగ్ సంస్థగా అవతరించేలా కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకుగాను మైక్రోసాఫ్ట్ గత ఏడాది ప్రారంభంలో బ్లిజార్డ్ కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోళ్లను యూరోపియన్ యూనియన్ అంగీకరించింది. కానీ ఈ విక్రయం క్లౌడ్ గేమింగ్‌లో పోటీని నిరోధిస్తుందని భావించింది బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ. దీంతో ఈ కొనుగోళ్లను వ్యతిరేకించింది.
కాల్ ఆఫ్ డ్యూటీ వీడియో గేమ్ సిరీస్‌ను విడుదల చేసేలా యాక్టివిజన్ పేరెంట్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో జరిపిన లావాదేవీలు జరగకుండా ఆపాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌లో దావా నమోదైంది. తాజాగా, ఫెడరల్ కోర్ట్ సైతం యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను, మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఈ విషయం గేమింగ్ పరిశ్రమలో చర్చాంశనీయంగా మారింది.
దాదాపు 50 ఏళ్లలో మైక్రోసాఫ్ట్ చేపట్టిన అతి పెద్ద డీల్ ఇది. ఇక వార్ టైప్ లో ఉండే ఈ వీడియో గేమ్స్ అటు గేమర్స్, ఇటు గేమింగ్ కంపెనీ లకు కూడా ఇష్టమైనవి. మరోవైపు మైక్రోసాఫ్ట్ ఎఫ్‌టీసీ నిబంధనలకు అనుగుణంగా యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు కాల్ ఆఫ్ డ్యూటీ తరహా వీడియో గేమ్ సిరీస్‌లను రాబోయే 10 ఏళ్లలో సోనీతో పాటు ఇతర ప్రత్యర్ధి సంస్థలకు అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ డీల్ ద్వారా గేమర్స్, గేమింగ్ కంపెనీలకు లాభదాయకంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ వాదిస్తోంది.