Rakesh Jhunjhunwala: స్టాక్‌మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం..
Rakesh Jhunjhunwala: స్టాక్‌మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం చెందారు.;
Rakesh Jhunjhunwala: స్టాక్‌మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం చెందారు. ఇండియన్ వారెన్ బఫెట్‌గా రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను పిలుస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో రాకేష్ పాప్యులారిటీ పొందారు. ఆయన ఒక షేర్‌లో పెట్టుబడి పెట్టినా, షేర్లు అమ్మినా.. తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక కంపెనీ షేర్ భవిష్యత్తులో ఎలా పర్ఫామ్ చేస్తుందో ఊహించి పెట్టుబడి పెట్టడం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టాలెంట్. అందుకే, కేవలం 5 వేల రూపాయల పెట్టుబడితో స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఇప్పుడు కోట్ల రూపాయలకు అధిపతిగా అయ్యారు.
ప్రస్తుతం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆస్తుల విలువ 40వేల కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని అంచనా. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా దేశంలోనే అత్యంత సంపన్నుల్లో 36వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆకాశ ఎయిర్‌లైన్స్, స్టార్ హెల్త్ కంపెనీలకు ప్రమోటర్‌గా కూడా ఉన్నారు. ఈమధ్యే మొదటి విమానం ముంబై నుంచి అహ్మదాబాద్ ప్రయాణించింది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సలహాలు, సూచనలతో స్టాక్‌మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్లు కోకొల్లలు. 1960 జూలై 5న జన్మించిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా.. ఈ ఉదయం ముంబైలో తుదిశ్వాస విడిచారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
నిన్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఉదయం 6గంటల 45 నిమిషాలకు తీవ్ర అస్వస్థతకు లోనై చనిపోయారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా చనిపోయారని వైద్యులు తెలిపారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను కాపాడేందుకు వైద్యుల బృందం నిరంతరం ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు. ఇండియన్ వారెన్ బఫెట్‌గా ఖ్యాతి గడించిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా.. 1985లో స్టాక్‌మార్కెట్‌లో అడుగుపెట్టారు. జస్ట్ 5 వేల రూపాయలతో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.
ట్రేడర్‌గా చార్టెడ్ అకౌంటెంట్‌గా ఎంతో పేరుగడించిన ఆయన.. భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో ఒకరు. స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఏది మాట్లాడినా అది బిగ్ న్యూసే అవుతుంది. గంటల్లో కోట్ల రూపాయలు, నెలలో వేయి కోట్ల రూపాయలు సంపాదించడంలో దిట్ట. కేవలం స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడితోనే వందల కోట్లు సంపాదించారు.
5వేలు పెట్టుబడి పెట్టి.. నాలుగేళ్లలోనే పాతిక లక్షల లాభాలు గడించిన వ్యక్తి ఒక్క రాకేష్ ఝున్‌ఝున్‌వాలానే. అందుకే, ఆయన ప్రతీ కదలికను ఫైనాన్సియల్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ గమనిస్తుంటారు. ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణంతో ప్రధాని మోదీ సహా, రాజకీయ ప్రముఖులు, పలువురు వ్యాపార వేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.