Vijay Sales Republic Day Sale : విజయ్ సేల్స్ రిపబ్లిక్ డే సేల్‎లో లూటీ ఆఫర్లు..రూ. 6,999 కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.

Update: 2026-01-19 05:15 GMT

Vijay Sales Republic Day Sale : కొత్త ఏడాదిలో మీ ఇంటికి కొత్త ఎలక్ట్రానిక్స్ లేదా గృహోపకరణాలు తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ రిటైల్ దిగ్గజం విజయ్ సేల్స్ రిపబ్లిక్ డే సేల్ 2026ను ప్రకటించింది. జనవరి 17 నుంచే ఈ భారీ సేల్ ప్రారంభమైంది. ఐఫోన్ల నుంచి వాషింగ్ మెషీన్ల వరకు ప్రతి వస్తువుపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు ఇస్తోంది. కేవలం ధర తగ్గించడమే కాకుండా, బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది.

ఈ సేల్‌లో అందరి దృష్టి ఆపిల్ ఉత్పత్తులపైనే ఉంది. ఐఫోన్ల ప్రారంభ ధరను రూ.47,490 గా నిర్ణయించారు. లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 17 ధర దాదాపు రూ.78,900 నుంచి ప్రారంభమవుతోంది. ఇక మాక్‌బుక్ ప్రియుల కోసం రూ.81,900 కే ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఐప్యాడ్‌లు రూ.30,990 నుంచి లభిస్తున్నాయి. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులను ఉపయోగించడం ద్వారా ఈ ధరలపై మరికొంత ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఆపిల్ గ్యాడ్జెట్స్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్.

బడ్జెట్ ఫోన్ల నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల వరకు విజయ్ సేల్స్ అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. కేవలం రూ.6,999 నుంచే మార్ట్‌ఫోన్లు ప్రారంభమవుతున్నాయి. టాబ్లెట్లపై ఏకంగా 40 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. ఇక స్మార్ట్ టీవీల విషయానికి వస్తే ప్రారంభ ధర రూ.8,490 కాగా, అదిరిపోయే పిక్చర్ క్వాలిటీ ఇచ్చే QLED టీవీలు రూ.10,590కే లభిస్తున్నాయి. ముఖ్యంగా VISE బ్రాండ్ టీవీలపై 65 శాతం వరకు భారీ డిస్కౌంట్ ప్రకటించడం విశేషం. హెడ్‌ఫోన్లు రూ.489 నుండి, స్పీకర్లపై 50 శాతం వరకు ధరల తగ్గింపు ఉంది.

ఇంటికి అవసరమైన వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్ లు రూ.8,990 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. చలికాలం కాబట్టి గీజర్లు రూ.3,199 కే లభిస్తుండగా, ఎయిర్ ఫ్రైయర్లు రూ.2,699 కి ఇస్తున్నారు. ఎండాకాలం రాకముందే ఏసీని కొనేయాలనుకుంటే రూ.24,390 కే బ్రాండెడ్ ఏసీలు సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పర్సనల్ గ్రూమింగ్ కిట్లు, ట్రిమ్మర్లు రూ.499 నుండే మొదలవుతున్నాయి. రోజువారీ అవసరాల కోసం షాపింగ్ చేసే వారికి ఈ సేల్ ఒక వరప్రసాదం.

విజయ్ సేల్స్ తన లోయల్టీ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి కొనుగోలుపై 0.75 శాతం పాయింట్లను అందిస్తోంది. బ్యాంకు ఆఫర్ల విషయానికి వస్తే, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై రూ.7,500 వరకు, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులపై రూ.15,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. మీరు ఎంచుకునే బ్యాంకు కార్డును బట్టి మీ పొదుపు రెట్టింపు అవుతుంది. కనుక పేమెంట్ చేసే ముందు మీ దగ్గర ఉన్న కార్డులపై ఉన్న ఆఫర్లను ఒకసారి చెక్ చేసుకోవడం మర్చిపోకండి.

Tags:    

Similar News