జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. ఫీల్డ్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలుసు కునేందుకు ఆయన యూనిఫాం, బ్యాగ్ తో ఎంట్రీ ఇచ్చారు. ఆర్డర్‌ను కలెక్ట్ చేసుకోవడాని కి ఓ మాల్‌లోకి వెళ్లగా.. లిఫ్ట్ కాకుండా మెట్లు ఎక్కమని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది సూచిం చారని తెలిపారు. 'మేం గురుగ్రామ్ లోని ఒక మాల్లో హల్దీరామ్స్ నుంచి ఆర్డర్ కలెక్ట్ చేసు కోవడానికి వెళ్లాం. అక్కడి సెక్యూరిటీ వాళ్లు వేరే ఎంట్రన్స్ నుంచి వెళ్లాలని సూచించారు. లిఫ్ కు అనుమతి లేకపోవడంతో మూడు అంతస్తులు మెట్లెక్కి వెళ్లాను. ఆర్డర్ కలెక్ట్ చేసుకునేప్పుడు కూడా స్టేర్ కేస్ నే ఉపయో గించాను. డెలివరీ పార్టనర్ల పరిస్థితులు మెరు గుపర్చడం కోసం మాల్స్ యాజమానులతో మరింత కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రహించాను. మాల్స్ కూడా వారిపై హ్యుమానిటీతో వ్యవహరించాలి' అంటూ ఎక్స్ పోస్టు పెట్టారు. దీనిపై నెటిజన్లు స్పం దించారు. మాల్స్ వద్దే కాదు.. కొన్ని కమ్యూని టీల్లో కూడా మెయిన్ లిఫ్ట్ వాడేందుకు డెలివరీ ఏజెంట్లను అనుమతించరని తెలిపారు.