ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో క్రియేట్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఫొటోలను తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించనున్నట్లు జొమాటో సీఈవో పిందర్ గోయల్ వెల్లడించారు. అలాంటి ఫొటోలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ చాలామంది కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.‘మా పనిని సమర్థంగా చేయడానికి జొమాటోలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. రెస్టారెంట్స్ మెనూల్లోని ఫుడ్ ఐటమ్స్ ఫొటోల కోసం మాత్రం ఏఐని వాడడాన్ని మేం ఆమోదించడం లేదు. ఏఐతో క్రియేట్ చేసిన ఫొటోలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. ఈ సమస్యపై కస్టమర్ల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. అందుకే ఏఐ ఇమేజెస్ వాడొద్దని మా భాగస్వామ్య రెస్టారెంట్లను కోరుతున్నాం. ఈనెలాఖరులోగా మెనూల నుంచి అటువంటి ఫొటోలను తొలగించడం ప్రారంభిస్తాం’ అని దీపిందర్ ‘ఎక్’స్‌లో పోస్ట్ చేశారు.