Mark Zuckerberg : ఆరు గంటలు..కోలుకోలేని నష్టం... పడిపోయిన జుకర్‌బర్గ్ స్థానం...!
Mark Zuckerberg : వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6 గంటల పాటు నిలిచిపోయాయి..;
Mark Zuckerberg : వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6 గంటల పాటు నిలిచిపోయాయి.. నిన్న రాత్రి 9 గంటల నుంచి స్తంభించిపోయిన సేవలను తిరిగి తెల్లవారుజామున 4 గంటలకి పునరుద్ధరించారు. ఫేస్‌బుక్ స్థాపించినప్పటికీ ఇప్పటివరకు ఇన్ని గంటల పాటు సర్వీసులు నిలిచిపోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.. సేవల సర్వీసుల విఘాతం వల్ల మార్క్ జుకర్‌బర్గ్ భారీ నష్టం కలిగినట్టుగా తెలుస్తోంది. సుమారుగా ఏడు బిలియన్ల డాలర్ల(50 వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ దెబ్బతో అపర కుబేరుల లిస్టు నుంచి ఆయన స్థానం కిందికి పడిపోయింది. కాగా జుకర్‌బర్గ్ ప్రస్తుతం 120.9 బిలియన్ డాలర్లతో బిల్‌గేట్స్ తర్వాత రిచ్ పర్సన్స్ లిస్ట్‌లో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.