Ketika Sharma : కేతిక శర్మకు బంపరాఫర్.. స్పెషల్ సాంగ్ ప్లాన్

Update: 2025-03-10 10:15 GMT

రొమాంటిక్ సినిమాతో 2021లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తార కేతిక శర్మ. తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా సినిమాలో నటించిందీ భామ. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో అమ్మడి గ్రాఫ్ పడిపోయింది. రెండేళ్ల క్రితం బ్రో సినిమాలో అలా మెరిసిన కెతిక ఆ తర్వాత మరో ఛాన్స్ అందుకోలేదు. నితిన్ లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్ లో అమ్మడు స్పెషల్ సాంగ్ ఛాన్స్ పట్టేసింది. నితిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అదిదా సర్ ప్రైజు అనే స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఈ సాంగ్ లో ఒక రేంజ్ లో రెచ్చిపోతుందట కెతిక శర్మ. కచ్చితంగా ఈ సాంగ్ తర్వాత కెతిక గురించి అందరు మాట్లాడుకుంటారని అంటున్నారు. సినిమాలో కరెక్ట్ టైం కి కెతిక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ వల్ల ఆమెకు.. అమ్మడి వల్ల సినిమాకు కూడా హెల్ప్ అయ్యేలా సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. మరి రాక రాక వచ్చిన ఛాన్స్ కాబట్టి కెతిక నెక్స్ట్ లెవెల్ లో గ్లామర్ షో చేసేసిందని అంటున్నారు. అదే నిజమై ఈ సాంగ్ క్లిక్ అయితే కేతికకు చాన్సులు క్యూ కట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News