'ముంతాజ్ ప్రేమకు గుర్తుగా తాజ్ మహాల్ని కట్టారు. కానీ దాన్ని తలదన్నేలా అంతకు మించిన గొప్ప ప్రేమ మందిరం ఇప్పటికే నా మనసులో కట్టేసాను. కానీ దాన్ని నేను భౌతికంగా చూపించలేను కాబట్టి తాజ్ మహల్ని మించిన మరో మందిరం కట్టి చూపిస్తాను. అది నాకు ఈ జన్మలో సాధ్యం కాకపోయి నా వచ్చే జన్మలోనైనా తప్పక కడతా' అంటూ తన మనసులోని ప్రేమను స్టార్ హీరోయిన్ త్రిషకు వ్యక్తం చేశాడో అభిమాని. చెన్నై అమ్మడు త్రిష తెలుగు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నత్రిష, ప్రస్తుతం చిరంజీవి సరసన 'విశ్వంభర' అనే చిత్రం చేస్తుంది. సాధారణంగా చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్లో అవకాశాలు రావడం చాలా అరుదు. కాని త్రిష మాత్రం అద్భుతమైన అవకాశాలు అందుకుంటుం ది. ఇదిలా ఉంటే ఫేవరెట్ హీరో గాని హీరోయిన్ పై అభిమానులు వారి అభిమానాన్ని నానా రకాలుగా వ్యక్తం చేస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా త్రిషకు ఓ అభిమాని చేసిన ప్రపోజ్ ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.