Kannappa Movie : కన్నప్ప నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్

Update: 2025-03-10 11:45 GMT

మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. అతని కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. ఈ తరానికి ఈ కథ చెప్పాలనుకోవడం ఆశ్చర్యమేం కాదు. ప్రస్తుతం ఈ తరహా సినిమాలు బాగా ఆడుతున్నాయి కూడా. అందుకే 1970ల్లోనే వచ్చిన భక్త కన్నప్ప కంటే ఈ ట్రెండ్ కు తగ్గట్టుగా టెక్నాలజీని కూడా వాడుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు విష్ణు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించింది.  ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి భారీ తారాగణం కూడా ఉంది.అయితే చాలామంది స్టార్స్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ ౨౫న కన్నప్ప ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

ఇక రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శివయ్య సాంగ్ కూడా మెస్మరైజ్ చేసింది. తాజాగా కన్నప్ప నుంచి లవ్ సాంగ్ అంటూ మరో పాట విడుదల చేశారు. పెద్దగా హడావిడీ లేకుండానే విడుదలైన ఈ సాంగ్ కూడా వినగానే ఆకట్టుకుంటోంది. స్టీఫెన్ దేవస్సీ సంగీతంలో శ్రీ మణి సాహిత్యం అందించగా రేవంత్, సాహితి పాడిన ఈ పాట సన్నివేశానికి తగ్గ మూడ్ ను క్రియేట్ చేస్తూ మంద్రంగా సాగుతూ మత్తుగా ఆకట్టుకుంటోంది.

‘సగమై చెరి సగమై ఇక నువ్వు నేనూ.. ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను.. ’ అంటూ సాగే గీతంలో.. మంచి సాహిత్యం కనిపిస్తోంది. అడవిలో ఉండే తిన్నడు తన ప్రేయసితో కలిసి పాడుకునే పాట ఇది. ఆ ఇద్దరూ జీవితాంతం కలిసి ఉంటాం అని బాస చేసుకునే సన్నివేశానికి సాహిత్యం బాగా కుదిరింది. ‘నీతో ఉంటే కలికాలమే సంపుతోంది చలికాలమై.. వెచ్చనైన చలిమంట నీ ఊపిరంట’ అనే లైన్ బలే అనిపిస్తుంది. మొత్తంగా విష్ణు మంచు చాలా చాలా నమ్మకంతో రూపొందిస్తోన్న కన్నప్ప నుంచి కొన్నాళ్లుగా వస్తోన్న ప్రతి అప్డేట్ అంచనాలు పెంచుతోంది. ఈ పాట కూడా మరింతగా ఆకట్టుకునేలానే ఉందని చెప్పాలి. 

Full View

Tags:    

Similar News