Ashika Ranganath : ట్రెడీషన ల్ వేర్లో ఆషిక మెస్మరైజ్

Update: 2025-04-28 08:00 GMT

నందమూరి కల్యాణ్ రామ్ 'అమిగోస్ ' చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్. ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈచిన్నది.. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత కింగ్ నాగార్జునతో నా సామిరంగలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. కన్నడలో మదగజ, అవతార పురుష, గరుడ వంటి చిత్రాల్లో నటించిన ఆషికాకు.. తక్కువ సమయంలో ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ వచ్చేసింది. అలాగే స్టార్ హీరోల సరసన చాన్స్ కొట్టేసింది. రీసెంట్ గా స్టార్ హీరో సిద్ధార్థ్ సరసన 'మిస్ యూ'లోనూ అలరించింది. ప్రస్తుతం ఆషికా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. తన గ్లామర్ డోస్ తో అమాంతం కుర్రకారును రెచ్చగొడుతున్న ఈము ద్దుగుమ్మ తాజాగా ఇన్స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ట్రెడీషన ల్ వేర్ లో మెస్మరైజ్ చేసింది. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ.. సెల్ఫీలు తీసుకు న్న పిక్ ను పోస్ట్ చేసింది.. 'పెళ్లిలో వింతలు.. నా లెన్స్ ఈ లుక్ ఐకిక్.. మేకప్, హెయిర్ & స్టైలింగ్ మీదే' అనే క్యాప్షన్ అటాచ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News