నేచురల్ స్టార్ కార్తీ అంటే తెలుగు ప్రేక్షకులకూ విపరీతమైన ఇష్టం, అభిమానం. అందుకే అతని సినిమాలు తమిళ్ తో సమానంగా తెలుగులో విడుదలవుతాయి.. విజయం సాధిస్తాయి. ప్రస్తుతం సర్దార్ 2 మూవీతో రెడీ అవుతున్నాడు కార్తీ. అయితే అతని అప్ కమింగ్ మూవీస్ చూసి కోలీవుడ్ మొత్తం నోరెళ్లబెడుతోంది. విశేషం ఏంటంటే.. వీటిలో మూడు పోలీస్ కథలు, రెండు గ్యాంగ్ స్టర్ స్టోరీస్ ఉంటే మరో రెండు పీరియాడిక్ ఫిల్మ్స్ ఉన్నాయి. సర్దార్ 2 తర్వాత వా వాతియార్ మూవీ రానుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. సర్దార్ 2 లోనూ పోలీస్, ఏజెంట్ గా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు.
ఆపై మోస్ట్ అవెయిటెడ్ మూవీ అయిన ఖైదీ 2 పట్టాలెక్కబోతోంది. లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం కూలీ మూవీతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ సాగుతోంది. కూలీ తర్వాత అతను వెంటనే ఖైదీ 2కు సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తాడు. ఇక తన 29వ సినిమా ‘టానాక్కారణ్’ రెండు భాగాలుగా ఉండబోతోంది. తమిళ అనే దర్శకుడు రూపొందించబోతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించబోతోంది. అన్నీ కుదిరితే కంగువా వస్తుంది. లేదంటే ఆగిపోయే అవకాశాలూ ఉన్నాయి.
అయితే చాలామంది చాలాకాలంగా ఎదురుచూస్తోన్న సీక్వెల్ అయిరత్తిల్ ఒరువన్( తెలుగులో యుగానికి ఒక్కడు) స్టార్ట్ కాబోతోంది. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ చేశాడు దర్శకుడు శ్రీ రాఘవ. దీంతో పాటు ధీరన్ అధికారం ఒండ్రు (తెలుగులో ఖాకీ) చిత్రానికీ సీక్వెల్ ప్లానింగ్ లో ఉంది. ఇవి కాక తెలుగులో నాని హిట్ 3 లో ఓ చిన్న పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తంగా కార్తీ మరో నాలుగైదేళ్ల వరకూ చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్స్ తో ఉండబోతున్నాడు. విశేషం ఏంటంటే.. ఇవన్నీ ప్రామిసింగ్ సినిమాలుగానే కనిపిస్తున్నాయి.