2025 ఏప్రిల్ లో విడుదల కావాల్సిన మూవీ రాజా సాబ్. మరి ఇంత ఆలస్యంగా విడుదల కాబోతోంది అంటే అప్పుడే అనేక అనుమానాలు కలిగాయి. సరే ఇన్ని రోజుల తర్వాత విడుదల అవుతోంది కాబట్టి ఇకనైనా స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తోంది అనుకున్నారు.. బట్ డౌటే అనిపిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన రెండు పాటలు అస్సలే మాత్రం ఆకట్టుకోలేదు. ‘సహనా సహనా నా సఖి సహనా.. నా కలలో నిన్నే చూశానా’ అంటూ సాగే గీతం ఇది. ముఖ్యంగా తాజాగా విడుదలైన పాట అస్సలు బాలేదు. ట్యూన్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ప్రభాస్ లుక్ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అతని ఏజ్ కూడా పెద్దగా కనిపిస్తోంది. మేకోవర్ పరంగా చూస్తే చాలా జాగ్రత్తలు తీసుకున్నా తర్వాతా ఇలాగే కనిపిస్తున్నాడు అంటేనే చాలా దారుణంగా కనిపిస్తాడు అనిపించాడు.
డ్యాన్స్ ల పరంగా కూడా దారుణంగా కనిపించాడు ప్రభాస్. అస్సలే మాత్రం ముందు జాగ్రత్తగా తీసుకోలేదు అన్నట్టుగా కనిపించాడు. అలాగే నిధి అగర్వాల్ కూడా అస్సలే మాత్రం ఆకట్టుకునేలా కనిపించింది. పాట చాలా చిన్నదే. అయినా ఆకట్టుకోలేదు అంటే ఏం చెబుతారు. ఇక రెండు పాటలు కూడా ఆకట్టుకోలేదు అంటే సినిమాపై అంచనాలు తగ్గుతున్నాయి అనిపించేలా ఉంది. మేకోవర్ ఎలా ఉన్నా.. ప్రభాస్ నటన బావున్నా.. కంటెంట్ పరంగా మాత్రం తేడా కొడుతోంది అనిపించేలా ఉంది. పైగా ఈ మూవీపై అంచనాలు అంటూ స్టార్ట్ కాలేదు. చాలామందికి అసలు రాజా సాబ్ విడుదలవుతోంది అనే విషయం కూడా తెలియదు. జనవరి 9న రిలీజ్ అవుతున్నా.. మూవీపై పెద్దగా అంచనాలు పెంచలేకపోయింది టీమ్.
దర్శకుడు మారుతి గురించి తెలుసు. ఈ మధ్య కాలంలో వరుసగా డిజాస్టర్స్ చూసి ఉన్నాడు. అవైతే చిన్న సినిమాలు. మరి ఈ మూవీపై అలా కాదు కదా. రాజా సాబ్ ఓటిటి బిజినెస్ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. చాలా రోజుల తర్వాత అది ఫైనల్ అయిందన్నారు. మొత్తంగా ఈ రెండు పాటలతోనే సినిమాపై ఒక నిర్ణయానికి రావొచ్చు అనిపించారు. అలా కాకుండా సినిమాపై భారీ క్రేజ్ పెంచే అవకాశాలు పెరిగేలా అవకాశాలు ఎక్కువగా చూడాలి. అప్పుడే వర్కవుట్ అవుతుంది.