బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా బుధవారం (జులై 30, 2025) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు నటుడు ప్రకాష్‌రాజ్ హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వంటి పలువురు సినీ ప్రముఖులకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. రానా దగ్గుబాటి ఇప్పటికే విచారణకు హాజరుకావాల్సి ఉండగా, షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా మరికొంత సమయం కోరారు. విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు హాజరు కావాల్సి ఉంది.