నిలకడగానే రజినీకాంత్ ఆరోగ్యం!
హైబీపీ సమస్యతో అపోలో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ మేరకు అయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో వైద్యులు.;
హైబీపీ సమస్యతో అపోలో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ మేరకు అయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. రజినీ ఆరోగ్య పరిస్థితి పైన ఎలాంటి ఆందోళనకర అంశాలు లేవని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన రిపోర్టుల బట్టి చూస్తే రజినీ ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగ్గు ఉందని తెలిపారు. అయితే ఇంకొన్ని రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. బీపీని ఈ రాత్రి మరోసారి పరీక్షించాల్సి ఉందన్నారు. వైద్య పరీక్షల నివేదికలు చూసి రేపు రజినీకాంత్‌ను డిశ్చార్జ్ చేస్తామన్నారు.
తమిళ సినిమా అన్నాత్తే సినిమా షూటింగ్ కోసం ఈ నెల 13న హైదరాబాద్‌కు వచ్చారు రజనీకాంత్. అప్పటినుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షెడ్యూల్ ఈ నెలాఖరున ముగియాల్సి ఉంది. అయితే సినిమా సెట్‌లో నలుగురికి కరోనా రావడంతో షూటింగ్‌ను నిలిపేశారు దర్శకుడు శివ. ముందు జాగ్రత్తగా ఈ నెల 22న రజనీకాంత్‌కు కరోనా పరీక్ష చేయించుకోగా నెగటివ్ వచ్చింది.
అప్పటి నుంచి సెల్ఫ్ క్వారంటైన్‌లోనే ఉన్నారు రజనీ. అయితే శుక్రవారం ఉదయం ఒక్కసారిగా రజినీకి అనారోగ్యం తలెత్తడంతో వెంటనే ఆయనని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి రజినీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.