Vinayakan : 'జైలర్' నటుడు అరెస్ట్

నటుడు వినాయకన్‌ను అరెస్ట్ చేసిన ఎర్నాకుళం నార్త్ పోలీసులు;

Update: 2023-10-25 01:27 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' చిత్రంలో విలన్‌గా నటించిన నటుడు వినాయకన్‌ను ఎర్నాకుళం నార్త్ పోలీసులు అక్టోబర్ 24న అరెస్ట్ చేశారు.. అనంతరం అతడిని ఎర్నాకులం జనరల్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు పూర్తి చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

మద్యం మత్తులో బహిరంగ ప్రదేశంలో అదుపు లేకుండా ప్రవర్తించడం, పోలీస్ స్టేషన్ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై వినాయకన్‌ని అరెస్టు చేశారు. పలు నివేదికల ప్రకారం, అతను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వద్ద గొడవ సృష్టించినట్లు ఫిర్యాదులు అందడంతో అతన్ని విచారణ కోసం స్టేషన్‌కు పిలిచారు.

"అతను (వినకాయన్) అసభ్యంగా ప్రవర్తించినందున ఈ చర్య తీసుకున్నారు. కాసేపటి తర్వాత విడుదల చేస్తారు. స్టేషన్ బెయిల్‌పై విడుదల చేస్తారు. అతను ఆ సమయంలో తాగి ఉన్నాడని మాకు అర్థమైంద"ని నార్త్ పోలీస్ ఎస్‌హెచ్‌ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) అన్నారు.


Tags:    

Similar News