'చంద్రముఖి 2', 'శబ్దం' తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన మలయాళ నటి లక్ష్మి మేనన్ కిడ్నాప్ కేసులో నిందితురాలిగా ఉంది. కొచ్చిలో ఓ ఐటీ ఉద్యోగిని స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి, అతడిపై దాడి చేశార న్న ఆరోపణలు వచ్చాయి. ఆ ముగ్గురిని అరెస్టు చేయగా.. నిందితుల్లో ఒకరిగా ఉన్న నటి లక్ష్మీ మీనన్ పరారీలో ఉందని కొచ్చి నగర పోలీస్ కమిషనర్ విమలాదిత్య తెలిపారు. ఆమె కోసం గాలిస్తున్నట్టు చెప్పారు ఆమె పేరును ఎఫ్ఎస్ఐఆర్లో ఇంకా చేర్చలేదని అంటున్నారు. ఓ బార్ వద్ద లక్ష్మి మేనన్, ఐటీ ఉద్యోగి బృందాల మధ్య వివాదం తలెత్తింది. అక్కడితో ఆ గొడవ సద్దుమణగకపో వడంతో.. సదరు ఎంప్లాయిని నటి, ఆమె స్నేహితులు వెంబడించారు. అతడి కారును అడ్డగించి, బలవం తంగా తమ కారులోకి ఎక్కించి తీసు కెళ్లి దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా లక్ష్మీమీన న్ ముందస్తు బెయిల్ కోసం కేరళ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యా యస్థానం ఆమెకు సానుకూలంగా నే ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 17వరకు ఆమెను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు సూచించింది.