Actress Poorna : రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన హీరోయిన్.. ఆ వార్తలకు చెక్..

Update: 2025-08-30 08:00 GMT

టాలీవుడ్ నటి పూర్ణ మరోసారి అభిమానులకు శుభవార్త చెప్పారు. ఇటీవల తన పర్సనల్ లైఫ్, భర్తతో విభేదాలపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ, ఆమె రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ సంతోషకరమైన వార్తను పంచుకున్నారు.

"ఈ శుభవార్తతో మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. మా కుటుంబంలోకి మరొకరు రాబోతున్నారు. మనం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవించడం అనేది నా జీవితంలో నిజమైన కల. అయితే, తల్లిదండ్రులు కావడం అనేది అన్నిటికంటే అందమైన అనుభవం. మేము మా రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుసుకున్నాం. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. కొత్త నవ్వులు, చిన్న అడుగులు మా జీవితాల్లోకి రానున్నాయి. రాబోయే రోజుల కోసం మేము ఆతృతగా ఎదురుచూస్తున్నాం" అని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. బిగ్ బ్రదర్ గా ప్రమోట్ అవుతున్నట్లు తన బాబు ఫోటోను షేర్ చేశారు పూర్ణ. దీంతో ఆమె అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా ఇటీవల పూర్ణ, ఆమె భర్త షానిద్ అసిఫ్ లకు మధ్య విబేధాలు వచ్చాయని, విడాకులు తీసుకుంటున్నారని పుకార్లు వచ్చాయి. షానిద్ చేసిన ఒక పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే, తర్వాత షానిద్ ఈ పుకార్లను ఖండిస్తూ మరొక పోస్ట్ చేశారు. అయినప్పటికీ, పూర్ణ ఈ విషయంపై స్పందించకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. ఇప్పుడు ఆమె రెండోసారి గర్భవతి అని ప్రకటించడంతో ఈ పుకార్లకు ముగింపు పలికారు.

Tags:    

Similar News