టాలీవుడ్ హీరోయిన్ సునయన ( Sunaina ) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవల తనకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు సోషల్ మీడియాలో వెల్లడిస్తూ, రింగులు మార్చుకున్న ఫొటోను షేర్ చేశారు. అయితే కాబోయే భర్త ఎవరనేది బయటపెట్టలేదు. అలాగే తనకు అభినందనలు చెప్పే ప్రతి ఒక్కరికీ ముందుగానే కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది.
సునయన తమిళంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ 2008లో విడుదలైన కాదలిల్ విడుదెన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పెళ్లికి ముందు ప్రేమకథ, రాజా రాజ చోర, చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్ లలో నటించింది. అలాగో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంది.