Varalaxmi : పెళ్లికి రావాలని అల్లు ఫ్యామిలీని ఆహ్వానించిన నటి వరలక్ష్మి

Update: 2024-06-21 10:28 GMT

తమిళ నటి వరలక్ష్మి శరత్‍కుమార్ ( Varalaxmi Sarath Kumar ), తన ప్రియుడు నికోలై సచ్‌దేవ్‌ని జూలై 2వ తేదీన వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరి పెళ్లి థాయ్‌లాండ్‌లో జరగనున్నట్లు సినీవర్గాల సమాచారం. ఈక్రమంలో టాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించేందుకు ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా ఈ జంట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ఇంటికి వెళ్లి అల్లు అరవింద్‌ని ( Allu Arvind ) కలిసి కుటుంబమంతా హాజరుకావాలని ఆహ్వానించింది.

హీరో రవితేజ, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానం అందించింది. కాగా వరలక్ష్మి, నికోలాయ్ సచ్‌దేవ్‌ వివాహం థాయ్‌లాండ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో పెళ్లి పనులు మొదలైనట్లు సమాచారం.

లేడీ విలన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ లుక్ లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది. ఇటీవలే హనుమాన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ బ్యూటీ.

Tags:    

Similar News