Vithika : అందుకే సినిమాలకు దూరమయ్యా: వితిక

Update: 2024-05-04 05:35 GMT

తాను సినిమాలకు దూరం అవ్వడానికి గల కారణాన్ని తాజాగా నటి వితిక పంచుకున్నారు. ’16 ఏళ్ల వయస్సులో అమ్మతో కలిసి ఓ మూవీ ఆడిషన్‌కు వెళ్లగా నన్ను సెలక్ట్ చేశారు. అయితే ఛాన్స్ ఇవ్వాలంటే నిర్మాతల నుంచి కమిట్మెంట్‌ ఒత్తిడి ఉంటుందని మా అమ్మ ఎదుటే చెప్పారు. అందుకు నేను ఒప్పుకోలేదు. ఇలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోలేకనే క్రమంగా సినిమాలకు దూరమయ్యా’ అని చెప్పారు. కాగా ఈమె హీరో వరుణ్ సందేశ్‌ను 2016లో పెళ్లాడారు.

2009లో ప్రేమించే రోజుల్లో మరి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కథానాయికగా సరైన అవకాశాలు రాకపోవడంతో అటు సెకండ్ హీరోయిన్‏గానూ.. సహాయ పాత్రలలోనూ కనిపించింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన భీమిలి సినిమాలో కనిపించింది.

2015లో యంగ్ హీరో వరుణ్ సందేశ్ జోడీగా పడ్డానండీ ప్రేమలో నటించింది. అదే ఏడాది వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కొంతకాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న వీరిద్దరు.. బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ లో పాల్గొని తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారు.

Tags:    

Similar News