Aishwarya Rai : సినిమాలు తగ్గినా తగ్గని ఐశ్వర్య రాయ్ సంపాదన.. ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటుందంటే?

Update: 2025-11-01 09:30 GMT

Aishwarya Rai : భారతీయ సినీ పరిశ్రమలో 28 ఏళ్లుగా తనదైన ముద్ర వేసిన మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గత ఏడేళ్లుగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, దేశంలోనే అత్యంత రిచ్చెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. చివరిసారిగా 2023లో పొన్నియిన్ సెల్వన్: II చిత్రంలో కనిపించిన ఈ 52 ఏళ్ల ఐశ్వర్య సంపద, నేటి తరం స్టార్ హీరోయిన్లయిన దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రా కంటే చాలా ఎక్కువగా ఉంది. మరి ఐశ్వర్య రాయ్ నికర ఆస్తి ఎంత? ఆమె సంపాదన రహస్యం ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

మీడియా నివేదికల ప్రకారం.. 52 ఏళ్ల ఐశ్వర్య రాయ్ బచ్చన్ నికర ఆస్తి సుమారు రూ.900 కోట్లుగా అంచనా. గత ఏడేళ్లుగా ఆమె హిందీ చిత్రాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమెకు ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. హమ్ దిల్ దే చుకే సనమ్, జోధా అక్బర్, దేవదాస్, ధూమ్ 2 వంటి విజయవంతమైన చిత్రాలలో ఆమె నటించారు. ఇవి ఆమె కెరీర్‌కు మైలురాళ్లుగా నిలిచాయి.

భారతీయ నటీమణుల సంపద జాబితాలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ నేటి తరం స్టార్ హీరోయిన్ల కంటే చాలా ముందున్నారు. 2024 హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం.. భారతదేశంలో అత్యంత రిచ్చెస్ట్ హీరోయిన్‎గా జూహీ చావ్లా అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె నికర ఆస్తి అంచనా సుమారు రూ.4,600 కోట్లు. ఈ జాబితాలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ రూ.900 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, ప్రియాంకా చోప్రా రూ.650 కోట్లతో మూడో స్థానంలో, దీపికా పదుకొణె రూ.500 కోట్లతో నాల్గో స్థానంలో ఉన్నారు.

ఐశ్వర్య రాయ్ ఆదాయంలో అధిక భాగం సినిమాల కంటే బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ నుంచే వస్తుంది. ఆమె జాతీయ, అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్‌లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. వీటిలో నగల కంపెనీలు, వాచీలు, కాస్మెటిక్ బ్రాండ్‌లు ఉన్నాయి. ఆమె ఒక రోజు బ్రాండ్ ప్రకటన షూటింగ్ కోసం ఏకంగా రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె పాల్గొనడం కూడా అంతర్జాతీయ బ్రాండ్‌లకు ఆమెకున్న ఆకర్షణను, తద్వారా ఆమె ఆదాయాన్ని పెంచింది.

ఐశ్వర్య రాయ్ 1997లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ఇరువర్(ఇద్దరు) తో సినీరంగ ప్రవేశం చేశారు. ఆమె ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఆరాధ్య బచ్చన్ అనే కూతురు ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆమెకు మామగారు. ఆమె నటించిన చివరి హిందీ చిత్రం ఫన్నే ఖాన్ 2018లో విడుదలైంది. అయినప్పటికీ, ఆమె తన స్థానాన్ని భారతీయ సినీ పరిశ్రమలో పటిష్టంగా నిలబెట్టుకున్నారు.

Tags:    

Similar News